బాలీవుడ్ దారిలోనే సైరా

రామ్ చరణ్ కి సైరా రిలీజ్ అన్ని భాషల్లోనూ ఒక ఎత్తైతే.. బాలీవుడ్ లో మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరు స్టామినా [more]

Update: 2019-09-20 07:56 GMT

రామ్ చరణ్ కి సైరా రిలీజ్ అన్ని భాషల్లోనూ ఒక ఎత్తైతే.. బాలీవుడ్ లో మరో ఎత్తు అన్నట్టుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరు స్టామినా వేరే చెప్పక్కర్లేదు. ఇక తమిళం నుంచి నయనతార, విజయ్ సేతుపతులు సైరా లో నటించారు కాబట్టి ఆ క్రేజ్ చూసుకోవక్కర్లేదు. అలాగే నయన్ అభిమానుల్తో పాటుగా… విజయ్ సేతుపతి అభిమానులు కూడా సైరా విడుదల కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. మరో పక్క కన్నడ నటుడు సుదీప్ క్రేజ్ సైరాకి చాలు. ఇక మిగిలిన హిందీ భాషలో ఎంతగా అమితాబ్ నటించినా అక్కడ సైరా కి క్రేజ్ సరిపోదు. అందుకే అక్కడ సైరాని భారీగా ప్రమోట్ చెయ్యాలి. ఇప్పటికే సైరా ట్రైలర్ మీద బాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు సైరాని పొగుడుతూ ట్వీట్ చేస్తున్నారు.

సెలబ్రెటీలకు ప్రత్యేకం…..

ఇక తాజాగా సైరా టీం బాలీవుడ్ లో సైరా విడుదలకు ముందే బాలీవుడ్ ప్రముఖులకు ఓ స్పెషల్ షో వెయ్యాలను కుంటుందట. మరి బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా.. ముందే సెలెబ్రిటీ షో ఉంటుంది. అలా ఇప్పుడు రామ్ చరణ్ కూడా సైరా సినిమాని ముందే అక్కడ సెలబ్రిటీస్ అందరిని ఆహ్వానించి ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం.

 

Tags:    

Similar News