చిరు రిక్వెస్ట్.. ఒప్పుకున్నారా?

చిరంజీవి – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణముగా బ్రేకులు పడడంతో.. ఈ సినిమాలో గెస్ట్ గా కనబడాల్సిన చరణ్ పాత్రపై అందరిలో [more]

Update: 2020-09-27 01:53 GMT

చిరంజీవి – కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణముగా బ్రేకులు పడడంతో.. ఈ సినిమాలో గెస్ట్ గా కనబడాల్సిన చరణ్ పాత్రపై అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా అనుకున్న ప్లాన్స్ అన్ని తల్లకిందులయ్యాయి. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఓ 30 నిమిషాల రోల్ కోసం డేట్స్ అడ్జెస్ట్ చేసాడు. RRR తో పాటుగా ఆచార్య సినిమా షూటింగ్ లోను చరణ్ పాల్గొంటాడని అన్నారు. కానీ కరోనా వలన అన్ని షూటింగ్స్ ఆగిపోయాయి. ఇలాంటి టైం లో రామ్ చరణ్ RRR కాదని ఆచార్య కి ఎలా వస్తాడనే అనుమానం మొదలైంది. అయితే చిరు మాత్రం రాజమౌళి ని రిక్వెస్ట్ చేసాం.. చరణ్ డేట్స్ ఇవ్వమని అడిగామని చెబుతున్నాడు.

ఆచార్య సినిమా స్క్రిప్ట్ లాంటి స్క్రిప్ట్ మళ్ళీ దొరుకుతుందో లేదో…. అందుకే చరణ్ తో కలిసి నేను నటిస్తున్నాను. నా భార్య సురేఖ మమల్ని ఇద్దరినీ ఒకే సినిమాలో చూడాలని కోరిక కోరింది. ఆమె కోరిక మేరకు ఆచార్య స్క్రిప్ట్ రెడీ అయ్యింది. చరణ్ – నేను స్క్రీన్ షేర్ చేసుకోవడానికి దీనికన్నా బెస్ట్ స్క్రిప్ట్ దొరకదు. అందుకే చరణ్ కోసం రాజమౌళి ని రిక్వెస్ట్ చేశామంటున్నాడు చిరు. మరి చరణ్ ఆచార్య షూట్ లో పాల్గొంటే RRR చిత్రీకరణ లేట్ అవ్వుద్ది. కాదు RRR అంటే ఆచార్య చిత్రీకరణ లేట్ అవుతుంది.

ఇక ఆచార్య లో ఆ పాత్ర చరణ్ చేస్తేనే బావుంటుంది. కాబట్టి చరణ్ కోసం వెయిట్ చెయ్యాల్సి వచ్చినా చెయ్యాలని అంటున్నాడు చిరు. మరి చిరు రిక్వెస్ట్ ని రాజమౌళి ఒప్పుకుంటాడా? లేదా? అనేది ఇప్పుడు సస్పెన్స్ అంటున్నారు. అయితే చిరు RRR షూటింగ్ చిత్రీకరణకు ఎలాంటి ఇబ్బందిలేకుండానే ఆచార్య షూటింగ్ చేస్తామని.. చరణ్ డేట్స్ ఇస్తే వచ్చే ఏప్రిల్ కల్లా ఆచార్య షూటింగ్ పూర్తి చేస్తామంటున్నాడు చిరు.

Tags:    

Similar News