చిరులో ఆ స్కిల్ గురించి చెప్పిన జక్కన్న

Update: 2018-06-25 08:00 GMT

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తీసిన సినిమా 'విజేత'. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు నిన్న గ్రాండ్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను జరిపారు. ముఖ్య అథితులుగా మెగా స్టార్ చిరంజీవి తో పాటు రాజమౌళి కూడా వచ్చారు. నిన్నఫంక్షన్ లో రాజమౌళి మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచే మాటలు బాగానే చెప్పాడు.

చిరంజీవికి ప్రత్యేక స్కిల్ ఉంది...

"చిరంజీవి గారు బాగా యాక్ట్ చేస్తారని.. ఫైట్స్ చేస్తారని..డాన్స్ వేస్తారని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇండస్ట్రీ జనాలకి మాత్రమే తెలిసిన విషయం ఇంకోటి ఉంది. అది చిరుకు స్టోరీని జడ్జ్ చేయడంలో స్పెషల్ స్కిల్ ఉంది. చిరంజీవి గారు స్టోరీని విన్న వెంటనే అందులో ఏది మంచో ఏది చెడో.. అందులో కావాల్సిందేంటి.. అవసరం లేనిదేంటి అన్న విషయాలు అయన పర్ ఫెక్ట్ గా చెప్పేస్తారు. 'మగధీర' టైంలో మేము ముందుగా స్టోరీ ఆయనకే చెప్పాము. అయన ఒకే అన్నకే మాకు సినిమాపై కాన్ఫిడెన్స్ వచ్చి సినిమాను స్టార్ట్ చేసాం. అలానే ఇప్పుడు 'విజేత' సినిమా స్టోరీ విని ఒకే చేసారు. ఇది కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం’’ అంటూ జక్కన్న చిరు జడ్జిమెంట్ పై తనకున్న అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.

ఇది పెద్ద సినిమానే..

"అలానే 'విజేత' సినిమా స్టార్ట్ చేయక ముందు నిర్మాత సాయి నా దగ్గరకు వచ్చి ఇది చిన్న సినిమా అన్నారు. ఇందులో టెక్నీషియన్స్ ఎవరు అని అడిగితే కెమెరా మెన్ గా సెంథిల్ ను పెట్టుకుందామని అనుకుంటున్నామని చెప్పారు. అప్పుడు చెప్పాను ఇది చిన్న సినిమా కాదు చాలా పెద్ద సినిమా అని. ఇందులో సాంగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా కోడి సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. నా వైఫ్ కి సాంగ్స్ అంటే ఇష్టం ఉండదు కానీ ఈ సాంగ్ ఆమెకు కూడా నచ్చింది. నా ఫ్యామిలీ మొత్తం ఈ పాటను మెచ్చుకున్నారు" అంటూ సినిమాలోని ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకొచ్చాడు రాజమౌళి.

Similar News