చిరు హామీ ఇచ్చాడో లేదో.. అల్లేస్తున్నారుగా?

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఎంత ఫాస్ట్ గా సినిమాలు చేద్దామన్నా ఏదో ఓ విషయంలో ఆ సినిమాలు లేట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కరోనా తో [more]

Update: 2020-07-15 03:03 GMT

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఎంత ఫాస్ట్ గా సినిమాలు చేద్దామన్నా ఏదో ఓ విషయంలో ఆ సినిమాలు లేట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా కరోనా తో ఆచార్య సినిమా సెట్స్ మీద ఆగిపోయింది. తర్వాత సాహో దర్శకుడు సుజిత్ తో కలిసి లూసిఫెర్ రీమేక్ చెయ్యబోతున్నాడు మెగాస్టార్ చిరు. అయితే చిరంజీవి మంచి కథలతో వస్తే ప్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తా అంటూ ప్రకటన చేసాడు. మెహర్ రమేష్, దర్శకుడు బాబీ లాంటి ప్లాప్ దర్శకులు తనని కథతో మెప్పించగలిగితే వాళ్ళతో సినిమాలు చేస్తా అంటూ కమిట్ అయ్యాడు. మరి చిరు లాంటి స్టార్ హీరో పిలిచి అవకాశం ఇస్తా అంటే ప్లాప్ దర్శకులు వదులుతారా…

అందుకే చిరు అలా చెప్పాడో లేదో ప్లాప్ దర్శకులంతా ఇలా రంగంలోకి దిగేసారు. అందులో మొదటగా దర్శకుడు బాబీ చిరు కోసం కథ రాసుకుని కూర్చున్నాడట. ఎలాగూ లాక్ డౌన్ చిరంజీవి కూడా ఇంటికే పరిమితమయ్యాడు. సో ఫుల్ ఖాళీ. కాబట్టి ప్లాప్ దర్శకులు ఒక్కొక్కరిగా చిరు సలహాలతో కథలు సిద్ధం చేస్తున్నారట. అందులో భగంగా దర్శకుడు బాబీ చిరు సలహాలు సూచనల మేరకు పూర్తి కమర్షియల్ హంగులతో చిరు హీరోయిజానికి సరిపోయే పవర్ ఫుల్ కథని సిద్ధం చేసాడని ఫిలింనగర్ టాక్. చిరు ప్రస్తుతం స్క్రీన్ మీద ఎలా కనబడితే బావుంటుంది, ఆయన వయసుకు, ఆయన ఎనేర్జికి తగ్గ కథతో బాబీ చిరు కి కథ వినిపించాడని టాక్ సోషల్ మీడియా\లో చక్కర్లు కొడుతోంది. మరి చిరు ఈ సినిమాని ఎప్పుడు ఫైనల్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News