సై రా కోసం చిరు కష్టాలు

Update: 2018-11-05 05:01 GMT

చాలా సినిమాల్లో చిరంజీవి పోలీస్ ఆఫీసర్ గా, దొంగగా చాలా సందర్భాల్లో తుపాకీతో రౌడీలను కాల్చిన సీన్స్ లో నటించాడు. అయితే సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లి.. వర్కౌట్ అవ్వక మళ్ళీ సినిమాల్లోకి తిరిగొచ్చిన చిరు చాలా విషయాల్లో పర్ఫెక్షన్ కోసం మళ్ళీ మళ్ళీ కొత్తగా నేర్చుకుంటున్నాడట. ఖైదీ నెంబర్ 150 తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సై రా నరసింహారెడ్డి అనే స్వాతంత్య్ర సమరయోధుడు జీవిత కథలో నటిస్తున్న చిరంజీవి ఆ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పటికే జరిజాలో యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసిన సై రా టీం ఇప్పుడు హైదరాబాద్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది.

అయితే తన సినిమాల్లో ఎపుడో తుపాకీ పట్టడం మానేసిన చిరు ఇప్పుడు సై రా నరసింహారెడ్డి కోసం మరోమారు తుపాకీ పట్టబోతున్నాడట. అయితే అందులో మెళుకువలు నేర్చుకోటం కోసం చిరంజీవి ప్రస్తుతం ప్రముఖ షూటర్ గగన్ నారంగ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ గగన్ నారంగ్ ఎవరో కాదు.... ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షూటర్. గగన్ అకాడెమీలో చిరంజీవి చాలా శ్రద్దగా ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. తొలి సెషన్‌లో భాగంగా సుమారు గంటసేపు... ఎయిర్ పిస్టల్స్, రైఫిల్స్ ఎలా కాల్చాలో గగన్ చిరంజీవికి టెక్నిక్స్ నేర్పినట్టు తెలుస్తోంది.

మరి ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకున్న చిరు కి మరోసారి కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడట గగన్. మామూలుగానే చిరు చాలా తొందరగా షూటింగ్ కి సంబందించిన టెక్నీక్స్ నేర్చుకున్నాడని గగన్ చెబుతున్నాడు. మరి ఇప్పటికే ఇలాంటి విషయాల్లో యంగ్ హీరో మాదిరిగా చిరు ఉంటున్నాడంటే చిరుకి సినిమాల మీదున్న కమిట్ మెంట్ తెలుస్తుంది. ప్రస్తుతం 80 పెర్సెంట్ షూటింగ్ జరుపుకున్న ఈ సై రా చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ వెకేషన్స్ కి విడుదలయ్యే ఛాన్స్ ఉంది

Similar News