చిరు కె ఎఫ్ సి చికెన్ రుచి చూస్తారా?

చిరంజీవి సినిమాల్లో నెంబర్ వన్ హీరో. మరి వంటల్లో కూడా చిరు నెంబర్ వన్. అప్పుడప్పుడు గరిట తిప్పే చిరంజీవి లాక్ డౌన్ లో చిరంజీవి తన [more]

Update: 2020-11-02 08:40 GMT

చిరంజీవి సినిమాల్లో నెంబర్ వన్ హీరో. మరి వంటల్లో కూడా చిరు నెంబర్ వన్. అప్పుడప్పుడు గరిట తిప్పే చిరంజీవి లాక్ డౌన్ లో చిరంజీవి తన తల్లి కోసం ఉప్మా పెసరట్టు వేసి పెట్టడం దగ్గరనుండి.. ఆయన చాలా రకాల డిషెస్ ఇంట్లో వాళ్ళ కోసం చేసిపెట్టారు. మరి సండే ఫన్ డే అన్నట్టుగా మానవరాళ్లతో.. చిరు సండే బోర్ కొడుతోంది అంటే.. మనవరాళ్లు ఇద్దరూ కె ఎఫ్ సి తినాలనుంది అనగానే.. బయట తిళ్ళు తింటే ఆరోగ్యం పాడవుద్ది…. ఎందుకు మనమే ఇంట్లో చేద్దామంటూ మానవరాళ్లతో కలిసి కె ఎఫ్ సి చికెన్ వండేశాడు చిరు.

అక్కడే కిచెన్ లో ఉన్న చికెన్ లెగ్ పీస్ లతో వాటికీ ఎంతెంత మసాలా కావాలో, ఏమేం కావాలో అనేది మానవరాళ్లతో చెప్పించి.. వాటిని మానవరాళ్లతోనే కలిపి ప్రైజ్ లో పెట్టించిన మూడు గంటలు నానిన తర్వాత చిరు ఇదంతా చూస్తుంటే రోడ్డు మీద బండి పెట్టి కె ఎఫ్ సి చికెన్.. కె ఎఫ్ సి చికెన్ అంటూ అమ్మేయ్యొచ్చు అని కామెడీ చెయ్యడమే కాదు.. ఆ చికెన్ లెగ్ పీసెస్ ని మాసాలతో పాటుగా మైదా తగిలించి ఆయిల్ ఉన్న బాండీలో  వేయించి.. కె ఎఫ్ సి తయారు చేసేసారు చిరు అండ్ మనవరాళ్లు. ఆ వీడియో చిరు ట్విట్టర్ లో షేర్ చెయ్యడమే కాదు.. రేపటి తరం అభిరుచికి నచ్చేటట్టు, రుచిగా ఏమన్నా చేయగలిగితే…ఆ కిక్కే వేరప్పా. అంటూ తమ్ముడి పవన్ డైలాగ్ ని వాడేసాడు.

Tags:    

Similar News