చిరు నిజంగా దేవుడే..!

చిరంజీవి ఇప్పుడు సినిమా పరిశ్రమలో పెద్దగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం. ప్రతి ఒక్క హీరో చిరు ని గౌరవిస్తారు. చిరు కూడా అదే విధంగా అందరికి హెల్ప్ [more]

Update: 2020-12-28 13:49 GMT

చిరంజీవి ఇప్పుడు సినిమా పరిశ్రమలో పెద్దగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం. ప్రతి ఒక్క హీరో చిరు ని గౌరవిస్తారు. చిరు కూడా అదే విధంగా అందరికి హెల్ప్ చెయ్యడం, తన దగ్గరకి వచ్చే ప్రసక్తి ఒక్క చిన్న హీరోలకి బెస్సింగ్స్ అందించడం లాంటివి భుజానకెత్తుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చిరు దేవుడిలా కనబడుతున్నాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద కంటెస్టెంట్స్ కి వరాల జల్లు కురిపించిన చిరు ని అందరూ దేవుడిలా పూజించేస్తున్నారు.

దివి కి వేదాళం లో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆఫర్ ఇచ్చిన చిరు మెహబూబ్ లో తనని తాను చూసుకున్నా అన్నాడు. అయితే మెహబూబ్ కి ఆ స్టేజ్ మీద ఎలాంటి సినిమా అవకాశం ఇవ్వకపోయినా ప్రస్తుతం చిరు తన ఆచార్య సినిమాలో మెహబూబ్ కి ఓ పాత్ర ఇచ్చాడనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ నడుస్తుంది. కొరటాల చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ కి ఓ పాత్ర చేస్తున్నాడనేది న్యూస్. దానితో నిజంగా చిరు దేవుడు అంటున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్.

Tags:    

Similar News