చిరు పక్కన హీరోయిన్ కంఫర్మ్..!

Update: 2018-08-08 07:42 GMT

రైటర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి చాలా కాలం తర్వాత డైరెక్టర్ గా 'మిర్చి' సినిమాతో మన ముందుకు వచ్చాడు కొరటాల శివ. చాలా తక్కువ సినిమాలు చేసి త్వరగా స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. 'భరత్ అనే నేను' సినిమా తర్వాత కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి.

చిరు పక్కన అనుష్క ఫిక్స్

అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా కంఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఇందులో చిరంజీవి రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక చిరు సరసన ఏ హీరోయిన్ ని తీసుకుందాం అనే పనిలో పడ్డారు మేకర్స్. అయితే ఫిలింనగర్ సమాచారం ప్రకారం చిరు సరసన అనుష్క శెట్టి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

చిరు డ్యుయల్ రోల్

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో చిరు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని మరో వార్త వచ్చింది. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అని వార్తలు వస్తున్నాయి.

Similar News