చిరు అంత పని చేశాడా?

సై రా సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివతో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆచార్య సెట్స్ మీదకి వెళ్లడం లేట్ అయినా.. [more]

Update: 2020-07-19 08:43 GMT

సై రా సినిమా తర్వాత చిరంజీవి కొరటాల శివతో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆచార్య సెట్స్ మీదకి వెళ్లడం లేట్ అయినా.. షూటింగ్ మొదలయ్యాక కూల్ గా స్పీడుగా ఆచార్య చిత్రీకరణను పూర్తి చేసే టైం లో కరోనా లాక్ డౌన్ తో ఆచార్య షూటింగ్ అందరికన్నా ముందే బ్రేకిచ్చేసారు. అయితే ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో మలయాళ లూసిఫెర్ సినిమాని రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేసాడు. లాక్ డౌన్ లో తెలుగు నేటివిటీకి దగ్గరగా సుజిత్ చిరు సలహాలు సూచనలతో లూసిఫెర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ ని రెడీ చేసినట్లుగా వార్తలొచ్చాయి. లాక్ డౌన్ ముగిసి ఆచార్య షూటింగ్ కొలిక్కి రాగానే మలయాళ లూసిఫెర్ రీమేక్ మొదలు పెట్టేలా ప్లాన్ చేసాడు చిరు. సుజిత్ కూడా లూసిఫెర్ తెలుగు స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నాడని అన్నారు. ఈలోపు ఈ రీమేక్ లో నటించే తెలుగు నటుల విషయంలో రోజుకో పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

అయితే తాజాగా చిరు లూసిఫెర్ రీమేక్ నుండి దర్శకుడు సుజిత్ ని తప్పించి వి వి వినాయక్ కి డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చినట్టుగా వార్తలొస్తున్నాయి. ఇపప్టికే వినాయక్ ఖైదీ నెంబర్ 150 రీమేక్ తో అదరగొట్టడంతో వినాయక్ అయితే లూసిఫెర్ రీమేక్ కి పెరిఫెక్ట్ గా సరిపోతాడని చిరు వినాయక్ కి పగ్గాలు అప్పజెప్పినట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా చిరు అసలు లూసిఫెర్ రీమేక్ ని ఆపేసినట్లుగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరు లూసిఫెర్ రీమేక్ ఆపేసి.. దర్శకుడు బాబీ చెప్పిన కథకి ఇంప్రెస్స్ అయ్యి.. బాబీ తో నెక్స్ట్ సినిమా ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. చిరు లూసిఫెర్ రీమేక్ కోసం గ్రౌండ్ వర్క్ చేయించి. ఇప్పుడు ఆపెయ్యడం ఏమిటో ఆయనకే తెలియాలి. మరోపక్క సుజిత్ లూసిఫెర్ తెలుగు స్క్రిప్ట్ తో మెప్పించని కారణంగానే లూసిఫెర్ రీమేక్ ని చిరు ఆపేసాడనే టాక్ వినబడుతుంది.

Tags:    

Similar News