అల్లు ఇంట మెగాస్టార్ బర్త్ డే వేడుకలు..!

Update: 2018-08-23 07:18 GMT

గత రెండు రోజులుగా ఇండస్ట్రీ మొత్తానికి మెగా ఫీవర్ పట్టుకుంది. నిన్నగాక మొన్న చిరు పుట్టిన రోజు కానుకగా సై రా నరసింహారెడ్డి టీజర్ విడుదలై మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను కూడా ఆకట్టుకుంది. అదే రోజు సాయంత్రం చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని శిల్ప కళా వేదికలో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక నిన్న చిరు పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే ఇండస్ట్రీలోని చిన్న పెద్ద నటులు చిరుకి విషెస్ తెలియజేశారు.

సందడి చేసిన స్టార్ డైరెక్టర్స్

నిన్న సాయంత్రం చిరంజీవి ఫ్యామిలీ మొత్తం అల్లు ఇంట సందడి చేసింది. అల్లు అరవింద్, అల్లు అర్జున్ స్పెషల్ గా తమ ఇంట్లో మెగా స్టార్ చిరు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మెగా ఫ్యామిలిలో చిన్నాపెద్దా అందరూ ఈ వేడుకల్లో సందడి చేసారు. కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్, వంశి పైడిపల్లి, మెహెర్ రమేష్ వంటి స్టార్ డైరెక్టర్ కూడా హాజరయ్యారు. మరి ఈ డైరెక్టర్స్ అందరితో మెగా ఫ్యామిలోని రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫోటోలు దిగుతూ నానా అల్లరి చేశారు. అల్లు అర్జున్ ఇంట జరిగిన చిరు పుట్టిన రోజు వేడుకల ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇక అల్లు శిరీష్ చిరు పుట్టిన రోజు వేడుకల్ని అల్లు ఇంట ఎలా జరిపారో చెబుతూ ఆ ఫొటోస్ తో పాటు.. అల్లు నివాసంలో మెగాస్టార్ బర్త్ డే బాష్. బాస్‌, బాయ్స్, నిన్న పార్టీకి హాజరైన డైరెక్టర్లతో ఓ పిక్. ఈ పిక్‌ను మా డాడీ తీశారు అంటూ ట్వీట్ చేసాడు.

Similar News