చిన్న సలహా అంటున్న చిరు?

చిరంజీవి ఆచార్య సినిమా కరోనా తో షూటింగ్ బ్రేక్ పడింది. అయితే కరోనా తో పరిస్థితిలు ఎలా ఉన్న హీరోలంతా షూటింగ్ అంటూ బయలుదేరుతున్నారు. చిరు మాత్రం [more]

Update: 2020-09-24 05:13 GMT

చిరంజీవి ఆచార్య సినిమా కరోనా తో షూటింగ్ బ్రేక్ పడింది. అయితే కరోనా తో పరిస్థితిలు ఎలా ఉన్న హీరోలంతా షూటింగ్ అంటూ బయలుదేరుతున్నారు. చిరు మాత్రం కదలడం లేదు. ఇక చిరు ఆచార్య సినిమా తర్వాత తమిళ వేదాళం రీమేక్ ని ప్లాప్ దర్శకుడు మెహర్ రమేష్ తో చెయ్యబోతున్నాడు. మెహర్ రమేష్ ఎప్పుడో తెలుగు స్క్రిప్ట్ రెడీ చేసి చిరు కి వినిపించాడని.. ఆ స్క్రిప్ట్ తెలుగు నేటివిటీకి, ఫాన్స్ కి మెచ్చేలా ఉండడంతో చిరు సింగిల్ సిట్టింగ్ లోనే మెహర్ స్క్రిప్ట్ ని ఓకె చేసాడనే టాక్ ఉంది. మెహెర్ రమేష్ స్క్రిప్ట్ కి చిరు ఎలాంటి మార్పులు చేర్పులు చెప్పలేదని అంటున్నారు.

అయితే తాజాగా చిరు మెహర్ కి ఓ సలహా ఇచ్చాడట. అది బడ్జెట్ కంట్రోల్ అంటున్నాడట. ప్రస్తుతం కరోనా వలన పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.. కాబట్టి అన్ని సినిమాలకు బడ్జెట్ కంట్రోల్ తప్పనిసరి అయ్యేలా ఉండడంతో.. చిరు మెహర్ ని పిలిచి వేదాళం రీమేక్ కావాల్సిన బడ్జెట్ ముందే వేసి.. ఎక్కడా వెస్ట్ ఖర్చు లు పెట్టకుండా బడ్జెట్ కంట్రోల్ ఉంచాలని సలహా ఇచ్చినట్టుగా ఫిలింనగర్ టాక్. ఇక చిరు ఆలా చెప్పడానికి గట్టి రీజన్ ఉందట. అదేమిటంటే.. గతంలో మెహెర్ తెరకెక్కికించిన శక్తి, షాడో, బిల్లా సినిమాలు బడ్జెట్ కంట్రోల్ లేక అట్టర్ ప్లాప్ అవడంతో చిరు ముందే మెహర్ ని పిలిచి బడ్జెట్ విషయమై కంట్రోల్ లో ఉంచాలని సూచించాడట. 

Tags:    

Similar News