చిరు కూడా కదులుతున్నాడా?

నిన్నటివరకు కరోనా భయం మాములుగా లేదు. కానీ కొంతమంది హీరోలు కరోనా కి భయపడడం లేదు. అందులో సీనియర్ హీరో నాగార్జున కూడా ఒకరు. నాగ్ అయితే [more]

Update: 2020-09-09 10:19 GMT

నిన్నటివరకు కరోనా భయం మాములుగా లేదు. కానీ కొంతమంది హీరోలు కరోనా కి భయపడడం లేదు. అందులో సీనియర్ హీరో నాగార్జున కూడా ఒకరు. నాగ్ అయితే అందరికన్నా ముందే మేకప్ వేసుకున్నాడు. బిగ్ బాస్ తో సెట్స్ మీదకెళ్ళిన నాగార్జున తదుపరి సినిమా షూటింగ్స్ కి హాజరవుతున్నారు. ఇక బాలయ్య, ప్రభాస్ లాంటోళ్ళు కూడా సినిమా సెట్స్ మీదకెళుతుంటే మెగా స్టార్ చిరు మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నాడు. మొన్నటివరకు ప్రభుత్వాల నుండి షూటింగ్స్ కి అనుమతుల కోసం తిరిగిన చిరు ఇప్పడు షూటింగ్ మీద ఆసక్తి చూపడం లేదు.

అయితే తాజాగా చిరు కూడా రంగంలోకి దిగబోతున్నాడనే టాక్ నడుస్తుంది. చిరు – కొరటాల కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకెళ్లబోతుందట. చిరు నే స్వయంగా కొరటాలకి ఫోన్ చేసి షూటింగ్ కి సిద్దమవ్వమన్నాడట. దానితో కొరటాల కూడా ఉత్సాహంగా ఆచార్య షూటింగ్ కి సమాయత్తమవుతున్నాడట,. ఇక షూటింగ్ ఎప్పుడు మొదలెట్టినా షెడ్యూల్ లో గ్యాప్ లేకుండా సినిమా చిత్రీకరణ జరపడానికి కొరటాల పక్కా ప్లాన్ చేస్తున్నాడట. అందుకే ఆచార్య సీన్స్ ఎక్కడెక్కడ ఎలా చెయ్యాలో కొరటాల ప్లానింగ్స్ చేసుకుంటున్నాడట. చిరు రాగానే సినిమా షూటింగ్ ని పరిగెత్తించాలని కొరటాల చూస్తున్నాడట. 

Tags:    

Similar News