ఇప్పటికింకా అంతే పూర్తయ్యిందా!

Update: 2018-07-16 04:17 GMT

చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అవ్వాలి. చిరంజీవి రీఎంట్రీ తోనే ఈ సినిమా చేయాలనుకున్నారు. కానీ అంత బడ్జెట్.. అంత సాహసం చేయలేక సేఫ్‌గా రీమేక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ని ఎంచుకున్నాడు. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో 'సైరా' సినిమాను స్టార్ట్ చేశాడు చిరంజీవి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూళ్లు కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా ఓ భారీ షెడ్యూల్ కూడా మొదలుపెట్టారు అది కూడా చివరి దశలో ఉంది. దింతో ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం అయ్యిపోయిందనుకున్నారు అంత. కానీ చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం ఇప్పటిదాకా 30 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందట. ఈ చిత్రం అవుట్ ఫుట్ విషయం రామ్ చరణ్ దగ్గర నుండి చిరంజీవి వరకు ఎవరు కంప్రమైజ్ అవ్వట్లేదంట. 'బాహుబలి' రేంజ్ లో ఈ చిత్రం రూపొందించాలనే ప్రయత్నం చేస్తున్నారట. అందుకే స్లో గా సినిమా నడుస్తుందని చెబుతున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారం ఈ ఏడాది చివరి లోపు షూటింగ్ పూర్తి చేసుకుని.. త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ లో పెట్టి వచ్చే ఏడాది మార్చి కళ్ళ ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు 30 శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో.. అనుకున్న డెడ్ లైన్ రీచ్ అవ్వడం కష్టమే అని చెబుతున్నారు. సో షూటింగ్ లేట్ అవుతుంది కాబట్టి ఇక ఈ సినిమా అక్టోబర్ లోనో.. సెప్టెంబర్ లోనో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయట

Similar News