అలసిపోవడమే ఆలస్యానికి కారణమా?

Update: 2018-05-16 06:55 GMT

చిరంజీవి, సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి షూటింగ్ స్పీడు బ్రేకర్లు ఎదురొస్తే బ్రేకులు పడినట్లుగా బ్రేకులు పడుతుంది. భారీ బడ్జెట్ తో దేశంలోని పలు భాషల్లో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలే కాదు, భారీ క్రేజ్ కూడా ఉంది. అయితే గత ఏడాది డిసెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ తో సెట్స్ మీదకెళ్లిన సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. అయితే ఇందుకు ముఖ్యకారణం చిరంజీవి అనే రూమర్ సోషల్ మీడియా లో ఉంది. సైరా నరసింహారెడ్డి సినిమాని ఈ ఏడాది చివరికల్లా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.

బాగా అలిసిపోతున్న చిరు...

మరి మేకర్స్ ఎంతగా సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని పాకులాడుతున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం ఆలస్యమవుతుందని, భారీ చారిత్రక నేపథ్యం ఉన్న ఉయ్యాలవాడ కథతో తెరకెక్కుతున్న సైరా సినిమా కోసం చిరంజీవి విపరీతంగా కష్టపడాల్సి వస్తోంది. మరి 60 ఏళ్ళు పైబడిన చిరంజీవి అలా కత్తులు కటార్లు తిప్పుతూ శారీరకంగా, మానసికంగా బాగా అలిసిపోవడం వలనే షెడ్యూల్‌కీ షెడ్యూల్‌కీ మధ్య పెద్ద గ్యాప్ ఏర్పడుతోందట. అందుకే షూటింగ్ కి గ్యాప్ ఇవ్వాల్సి వస్తుందంటున్నారు. ఆయన అలా అలసిపోవడం వలన ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందట.

ప్రొడ్యూసర్ గా నలిగిపోతున్న రామ్ చరణ్....

అందుకే అనుకున్న టైంకి సైరా షెడ్యూల్ కంప్లీట్ కావడం లేదనే టాక్ వినబడుతోంది. మరి ఇలా షూటింగ్ కి భారీ గ్యాప్ ఇచ్చేస్తుంటే ఈ సినిమాలో చాలామంది ఇతర భాషల నుండి ప్రముఖ నటులు నటిస్తున్నందున వారి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యడంలో నిర్మాత రామ్ చరణ్ నలిగిపోతున్నాడనే టాక్ గట్టిగానే వినబడుతోంది. మరి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సైరా నుండి తప్పుకుని నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు సై రా కి మ్యూజిక్ డైరెక్టర్ ని సెట్ చెయ్యలేకపోయింది సై రా టీమ్. మరి ఈ రకంగా నత్తనడకన సై రా షూటింగ్ సాగితే సంక్రాంతికి వచ్చే సై రా కాస్తా సమ్మర్ కి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. మరి మెగా ఫాన్స్ కి సై రా తో మెగా వెయిటింగ్ తప్పేలా లేదు.

Similar News