ఏ హీరో అయితే నాకేంటి అంటున్న నయన్

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది కానీ.. ఆ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం రాదు. నయనతారని [more]

Update: 2019-08-22 05:46 GMT

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది కానీ.. ఆ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం రాదు. నయనతారని ప్రమోషన్స్ కి పిలవాలంటే నిర్మాతలకి ఒణుకు. తెలుగైనా, తమిళయినా, మళయాళమైన ఏదైనా నయనతార సినిమాలో నటిస్తుంది కానీ.. ప్రమోషన్స్ కి మాత్రం రాదు. ఎమ్మా అంటే సెంటిమెంట్ అంటారు, కాదు ప్రమోషన్స్ కి స్పెషల్ రెన్యుమరేషన్ తీసుకుంటుందని అంటారు. అయితే నయనతార తాను నటించిన సినిమాల ప్రమోషన్స్ కి వెళ్లిన ఈవెంట్స్ వేళ్ళలో లో లెక్కెట్టొచ్చు. కాకపోతే ఈసారి నయనతార మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటిస్తున్న సై రా నరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ కి పాల్గొంటుందని అనుకున్నారు అంతా.

ఎందుకంటే నయనతార సై రా మూవీలో చాలా ముఖ్యమైన హీరోయిన్ రోల్ చేస్తుంది. అందులోను సై రా నరసింహారెడ్డి సినిమా నాలుగు భాషల్లో విడుదలకాబోతుంది.. మరి ప్రమోషన్స్ కి హాజరైతే నయనతార మీద మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ హైలెట్ చేస్తుంది. దానితో నేషనల్ వైడ్ నయనతార పేరు మార్మోగుతుంది. అలాగే సై రా టీం కి బలం చేకూరేది. కానీ ముంబై లో జరిగిన సై రా నరసింహారెడ్డి టీజర్ లాంచ్ ఈవెంట్ కి చిరు, రామ్ చరణ్, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి హీరోలంతా హాజరయ్యారు. ఇక ఓ కీ రోల్ ప్లే చేస్తున్న తమన్నా కూడా ఈ ఈవెంట్ కి హాజరైంది. కానీ నయన్ మాత్రం రాలేదు. అయితే సై రా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కో, ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా రామ్ చరణ్… నయనతారని ఒప్పించి తీసుకురావొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇక నయనతార ఉయ్యాలవాడ నరసిమహారెడ్డి భార్య పాత్రలో అద్భుతమైన అందంతో సైరా లో కనిపిస్తుంది. సైరా లో నయన్ లుక్ చాల ప్రత్యేకంగా కనబడుతూ ఆపాత్రపై అంచనాలు పెంచేస్తుంది

Tags:    

Similar News