టాప్ డైరెక్టర్ తో చిరు సినిమా..?

ప్రస్తుతం సైరా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం తరువాత కొరటాల డైరెక్షన్ ఓ పవర్ ఫుల్ చిత్రం చేయనున్నాడు. ఆల్రెడీ [more]

Update: 2019-04-16 07:59 GMT

ప్రస్తుతం సైరా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం తరువాత కొరటాల డైరెక్షన్ ఓ పవర్ ఫుల్ చిత్రం చేయనున్నాడు. ఆల్రెడీ కొరటాల స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేసి చిరు కోసం వెయిట్ చేస్తున్నాడు. సైరా అయిన వెంటనే చిరు కొరటాల సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇదిలా ఉంటే కొరటాల సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా గురించి పుకార్లు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం చిరు శంకర్ తో సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కొన్ని చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగులో చిరు హీరోగా

కొరటాల సినిమా త్వరగా కంప్లీట్ చేసి శంకర్ డైరెక్షన్ లో నటించాలని చిరు భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే శంకర్… చిరుకి సరిపోయేలా ఒక కథ రాసుకున్నాడట. తెలుగులో చిరు హీరోగా తమిళంలో విజయ్ లేదా అజిత్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడట శంకర్. అన్నీ కుదిరితే ఈ సినిమాను అల్లు అరవింద్, రామ్ చరణ్, స్టూడియో గ్రీన్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో వారికే తెలియాలి.

Tags:    

Similar News