కొరటాలకు చుక్కలు చూపిస్తున్న చిరు

Update: 2018-12-02 04:01 GMT

భరత్ అనే నేను సినిమా తర్వాత కొరటాల శివ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. మెగా స్టార్ చిరంజీవితో కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని.. రామ్ చరణ్ తో చెయ్యాల్సిన కొరటాలకు చిరు తో సినిమా చేసే అవకాశం దక్కింది . ఎక్కడా అధికారిక ప్రకటన రాలేదుకాని.. చిరంజీవి సై రా నరసింహారెడ్డి సినిమా తరవాత కొరటాల శివ సినిమానే చిరు చేస్తున్నాడన్నారు. అసలైతే కొరటాల - చిరు మూవీ ఈ నెలలోనే సెట్స్ మీదకెళ్లాల్సి ఉండగా... చిరు బిజీ వలన, కొరటాల కథను పూర్తిగా సిద్ధం చేయకపోవడంతో.. ఈ క్రేజీ కాంబో 2019 సంక్రాతి తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పారు. ఈలోపు సై రా సినిమా షూటింగ్ ని చిరు ఒక కొలిక్కి తెచ్చేస్తాడని... ఎలాగూ సై రా సమ్మర్ రిలీజ్ కాబట్టి కొరటాల మూవీ కి చిరి ఫిబ్రవరి నుండే సిద్దమవుతాడన్నారు.

కానీ నిన్న సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో సై రా సినిమా ని సురేందర్ రెడ్డి మాటిమాటికి రీ షూట్స్ చెయ్యడంతో.. వచ్చే వేసవికి విడుదలవ్వాల్సిన సై రా నరసింహారెడ్డి సినిమా 2020 సంక్రాంతికి షిఫ్ట్ అయినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే చిరు - సురేందర్ రెడ్డి లు సై రా లో కొన్ని సీన్స్ కి సంతృప్తి చెందక రీ షూట్స్ చెయ్యడంతో... సై రా వేసవి నుండి సంక్రాంతికి షిఫ్ట్ అయ్యిందని అంటున్నారు. అయితే ఆ అన్యూస్ అలా నడుస్తుండగా... చిరు తో సినిమా కోసం వెయిట్ చేస్తున్న కొరటాల శివ సై రా షూటింగ్ ఆలస్యమవడంతో... ఇప్పుడు చిరు ని వదిలేసి మరో హీరో కి కథ చెప్పే ఏర్పాట్లు చేసుకుంటున్నాడనే టాక్ కూడా సోషల్ మీడియాలో బయలుదేరింది.

సై రా రీ షూట్స్ తో కొరటాల సినిమాకి చిరు డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకపోతున్నాడని.. అందుకే కొరటాల శివ ఏం చెయ్యాలో తెలియక మరో హీరో ని చూసుకుంటున్నాడని అంటున్నారు. మరి ఎప్పుడూ స్టార్ హీరోలతోనే సినిమాలు ప్లాన్ చేసే కొరటాలకు ప్రస్తుతం స్టార్ హీరోలందరితో ఒక్క బన్నీ తప్ప మరే ఛాయస్ లేదు. మరి అల్లు అర్జున్ కూడా ఏ దర్శకుడికి ఇంతవరకు కమిట్ అవ్వలేదు . దాదాపుగా కొరటాల, అల్లు అర్జున్ ఇద్దరు ఒకేసారి తమ సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరు ఇప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయలేదు.

Similar News