చిరు సినిమాకు మరో నిర్మాత

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ మీద కంటే చిరంజీవి కెరీర్ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో [more]

Update: 2019-03-08 10:25 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ మీద కంటే చిరంజీవి కెరీర్ మీదే ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు తరువాత సురేందర్ రెడ్డితో సైరా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత కొరటాలతో సినిమా కూడా చరణే నిర్మించనున్నాడు. వచ్చేనెల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ చిత్రానికి తన స్నేహితుడైన మిక్కిలినేని సుధాకర్‌ బ్యానర్ లో చేయాలని కొరటాల అడిగాడట. ఎప్పటి నుండో తనను వెయిటింగ్ చేయిస్తున్నానని, అందుకే అతనితో ఈ చిత్రం చేస్తానని అడిగాడట.

పార్ట్ నర్ గా చేర్చుకునేందుకు ఓకే

అయితే ఈ చిత్రం కొణిదెల ప్రొడక్షన్స్‌ లో తీయాలని చరణ్‌ ఫిక్స్‌ అయిపోయాడు కాబట్టి సుధాకర్‌ ని కూడా పార్టనర్‌గా చేర్చుకోవడానికి చరణ్‌ అంగీకరించాడట. కానీ బిజినెస్ వ్యహారాలన్నీ కొరటాలనే చూసుకుంటానని అన్నాడట. అందుకు రామ్ చరణ్ సరే అని చెప్పాడని టాక్. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వేట జరుగుతుంది. అయితే ఒక లీడ్ పాత్ర కోసం శృతి హాసన్ ని సంప్రదించారట. ఆమె ఓకే చెప్పడమే ఆలస్యం.

Tags:    

Similar News