చిరు – కొరటాల శివ సినిమా అప్పుడే..!

మెగాస్టార్ చిరంజీవికి ఒక లైన్ చెప్పి ఎప్పుడో ఇంప్రెస్స్ చేసిన కొరటాల.. చాలాకాలం నుండి చిరు కోసం వెయిట్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో షూటింగ్ [more]

Update: 2019-05-31 11:27 GMT

మెగాస్టార్ చిరంజీవికి ఒక లైన్ చెప్పి ఎప్పుడో ఇంప్రెస్స్ చేసిన కొరటాల.. చాలాకాలం నుండి చిరు కోసం వెయిట్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే సైరా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసుకుని చిరు కోసం వెయిట్ చేస్తున్న కొరటాల ఎట్టి పరిస్థితుల్లో జూన్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని చాలానే ప్రయత్నించారు. అందుకు మొదట చిరు, చరణ్ ఓకే కూడా చెప్పారు. కానీ సైరా తర్వాత కాస్త విరామం కావాలని చిరంజీవి కోరడంతో ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆగస్టుకి వెళ్లింది.

ఆరు నెలల్లో షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్

ఈ గ్యాప్ లో కొరటాల ఓ స్టార్ హీరోతో ఓ సినిమా చేసి వచ్చేవాడు. కొరటాలకి చకచకా సినిమాలు చేయడం అలవాటు. కానీ చరణ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కొరటాల శివ ఇంకా ఎదురు చూడాల్సి వస్తోంది. ఆగస్టులో కచ్చితంగా స్టార్ట్ అవుతుందని నమ్మకంతో ఉన్న శివ షూటింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలు 6 నెలల్లో పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకు తగ్గ ప్లాన్ కూడా రెడీ చేసారు. ఇక చిరు కోసం హీరోయిన్స్ ని వెతికే పనిలో ఉన్నాడు శివ. తెరపైకి చాలా పేర్లు వచ్చాయి కానీ ఫైనల్ గా ఎవరు అనేది ఇంకా తెలియలేదు. త్వరలోనే అధికారంగా ప్రకటించే అవకాశముంది.

Tags:    

Similar News