మూవీ టైటిల్ ని రివీల్ చేసేసిన చిరు?

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిరు 152 సినిమా విషయాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా వినిపిస్తున్నాయి. ఈసినిమాలో రామ్ చరణ్ ఓ పాత్ర చేస్తున్నాడని [more]

Update: 2020-03-02 05:34 GMT

చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిరు 152 సినిమా విషయాలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా వినిపిస్తున్నాయి. ఈసినిమాలో రామ్ చరణ్ ఓ పాత్ర చేస్తున్నాడని అన్నారు. కాదు RRR షూటింగ్ తో రామ్ చరణ్ చెయ్యడం లేదు.. చరణ్ కేరెక్టర్ కి కొత్తగా సూపర్ స్టార్ మహేష్ చేస్తున్నాడనే న్యూస్ నడుస్తుంది. మూవీ టీం నుండి ఎటువంటి ప్రకటన రాకపోయినా.. చిరు సినిమాలో మహేష్ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. మహేష్ కూడా చిరు సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, 30 నిమిషాల పాత్ర కోసం 30 కోట్లు మహేష్ అందుకోబోతున్నాడనే న్యూస్ నడుస్తుంది. ఇదంతా ఒక ఎత్తు చిరు 152 టైటిల్ విషయం ఒక ఎత్తు అన్నట్టుగా సోషల్ మీడియాలో చిరు 152 టైటిల్ గోవింద ఆచార్య అంటూ ప్రచారంలో ఉంది.

కొరటాల శివ – చిరు సినిమా మొదలైనప్పటినుండి మెగా ఫ్యాన్స్ చిరు 152 టైటిల్ గోవింద ఆచార్య అని ప్రచారం చెయ్యడమే కాదు.. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వదులుతూ అదే టైటిల్ ని ట్రేండింగ్ లోకి తెస్తుంది. అయితే చిత్ర బృందం మాత్రం చిరు టైటిల్ విషయంలో గుంభనంగా ఉంటే.. తాజాగా ఆ సస్పెన్స్ ని చిరు రివీల్ చేసిపడేసాడు. చిరంజీవి తాజాగా ఓ పిట్ట కథ ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవగా.. ఆ స్టేజ్ మీద మెగాస్టార్ మాటల మధ్యలో కొరటాల మూవీ సినిమా విషయాలు మట్లాడుతూ ఆచార్య సినిమా షూటింగ్ అంటూ తన సినిమా టైటిల్ ని తానే రివీల్ చేసేసాడు. దానితో మెగా ఫ్యాన్స్ ఆనందానికి ఆవధుల్లేవ్. మేము అనుకున్నదే టైటిల్ అంటూ వారు పిచ్చ హ్యాపీ గా ఉన్నారు. కానీ నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు కొరటాల మాత్రం షాకయ్యారు. టైటిల్ విషయాన్నీ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా స్పెషల్ గా విడుదల చేద్దామనుకుంటే చిరు మాత్రం ఇలా చడీచప్పుడు లేకుండా తుస్ మనిపించాడని అనుకుంటున్నారట.

Tags:    

Similar News