కొడుకు సెట్స్ లో చిరు

Update: 2018-09-20 07:22 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ పెట్టని ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం అజర్ బైజాన్ లో జరుపుకుంటుంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు బోయపాటి. అక్కడ లొకేషన్స్ కు సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా కొన్ని రోజులు కిందట బయటికి వచ్చాయి. మరోపక్క రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా షూటింగ్ జార్జియాలో జరగనుంది.

ఆల్రెడీ 'సైరా' టీం మొత్తం జార్జియాలో ఉన్నారు. కానీ చిరంజీవి మాత్రం ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నారు. నిన్న బుధవారం జార్జియాకు వెళ్లేందుకు బయల్లేరిన మెగాస్టార్ ముందుగా తన కొడుకు చరణ్ సినిమా లొకేషన్ కి వెళ్లారు. అక్కడే సాయంత్రం వరకు ఉండి వారితో టైం స్పెండ్ చేశారు. అంతేకాదు మరో రెండు మూడు రోజులు అక్కడే ఉండనున్నారు చిరంజీవి. ఆ తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ గా జార్జియాకు వెళ్లనున్నారు. జార్జియా లో చిరు పైన భారీ యాక్షన్ ఎపిసోడ్ లే చిత్రీకరిస్తున్నారు.

ఒకేసారి తండ్రి, కొడుకుల సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుంది. ఇక రామ్ చరణ్ సినిమా ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు టీం. 'సైరా' చిత్ర షూటింగ్ చకచకా జరుగుతున్న భారీ యాక్షన్స్ ఎపిసోడ్స్ ఉన్నందున షూటింగ్ కి టైం పడుతుంది. ఐన కానీ ఎట్టి పరిస్థితిల్లో ఈసినిమాను వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్.

Similar News