తండ్రి హిట్ సినిమా రీమేక్ చేయనున్న చెర్రీ...?

Update: 2018-06-13 10:14 GMT

కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి.. తేజ ఐ లవ్ యూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్.. కేఎస్ రామారావు నిర్మాతగా ఒక సినిమా ఉంటుందని చెప్పాడు. గతంలో చిరు కి అనేక సినిమాలు సూపర్ హిట్స్ గా అందించారు నిర్మాత కేఎస్ రామారావు . కానీ వారి కాంబోలో వచ్చిన స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అవడంతో ఆ కాంబో కి బ్రేక్ పడింది. కానీ ఇప్పుడు ఇన్నాళ్ళకి తన కొడుకు హీరోగా కె ఎస్ రామారావు నిర్మాతగా ఒక సినిమా ఉండబోతుందంటూ పక్కాగా చెప్పారు. మరి చిరు ఆలా వారి కాంబో ని సెట్ చేసాడో లేదో ఇలా చరణ్ కె ఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి సూపర్ హిట్ ఫిలిం గ్యాంగ్ లీడర్ ని రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి.

గ్యాంగ్ లీడర్ రీమేక్..?

విజయ బాపినీడు డైరెక్షన్ లో 1990లో చిరంజీవి హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం. అయితే రామ్ చరణ్ రచ్చ చేసిన టైం లో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాని రీమేక్ చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొట్టాయి. అయితే ఆ విషయమై ఎక్కడా మెగా ఫ్యామిలీ నోరు విప్పి ఖండించనూలేదు. అలాగని ఆ రీమేక్ ఉంటుందని చెప్పనూ లేదు. కానీ కొన్నాళ్లుగా ఈ గ్యాంగ్ లీడర్ రీమేక్ అనేది మరుగున పడింది. మళ్ళీ చిరు చేసిన వ్యాఖ్యలతో రామ్ చరణ్ గ్యాంగ్ లీడర్ రీమేక్ న్యూస్ బాగా హెల్త్ అయ్యింది.

డైరెక్టర్ ఎంపిక బాధ్యత నిర్మాతపైనే...

అయితే చిరంజీవి పక్కా స్కెచ్ తోనే ఈ హింట్ ఇచ్చాడని.. కేఎస్ రామారావు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా గ్యాంగ్ లీడర్ గ్రౌండ్ వర్క్ మొదలైపోయిందని... ఈ సినిమాని డైరెక్ట్ చేసే వ్యక్తి ని మాత్రం ఇంకా సెలెక్ట్ చెయ్యకపోవడం వల్లే అధికారిక న్యూస్ ఇవ్వలేదంట. అయితే ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తే బావుంటుంది అనే నిర్ణయాన్ని మెగాస్టార్ చిరు నిర్మాతకు వదిలేశారని టాక్ వినబడుతుంది. అందుకే పక్కాగా తేజ్ ఐ లవ్ యూ స్టేజ్ మీద చిరు అంత కాన్ఫిడెన్స్ గా చెర్రీ - కేస్ రామారావు సినిమా అనౌన్సమెంట్ ఇచ్చాడని అంటున్నారు.

Similar News