అల్లూరి పాత్రలో చిరంజీవి..!

Update: 2018-11-13 07:24 GMT

మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' తరువాత చేస్తున్న చిత్రం 'సైరా'. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో వీరయోధుడిగా నటిస్తున్న చిరంజీవిపై కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు యూనిట్. టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలోనూ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నట్టు సమాచారం. ఆంగ్లేయులతో పోరాడి వారి చేతుల్లో ప్రాణాలు విడిచిన అల్లూరి సీతారామరాజుకు సంబందించిన కొన్ని ముఖ్యమైన షాట్స్ తీయనున్నారు సురేంద్ర రెడ్డి.

కృష్ణను మరిపిస్తారా..?

మరి అల్లూరి సీతారామరాజుగా చిరంజీవి ఎలా ఉండబోతున్నారని ఇప్పటి నుండే అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. అల్లూరి సీతారామరాజు అంటే మనకి గుర్తు వచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. గతంలో ఆయన ఈ పాత్రలో జీవించారనే చెప్పాలి. ఇప్పుడు ఆ పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారు. మరి ఆ పాత్రకు చిరంజీవి ఎంతవరకు న్యాయం చేస్తారో చూడాలి. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Similar News