హాకీ కోచ్ గా చిరు?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న చిత్రం కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం చిరు ఈ కథ [more]

Update: 2019-07-18 07:53 GMT

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న చిత్రం కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం చిరు ఈ కథ పరంగా ఫిట్ గా ఉండడం కోసం వెయిట్ తగ్గుతున్నారు. అలానే మరోవైపు సైరా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నారు. అయితే కొరటాల సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ ఒక లీక్ అయితే ఇప్పుడు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది.

స్పోర్ట్ పర్సన్ గా…..

లీక్ ప్రకారం ఇందులో చిరు హాకీ కోచ్ గా కనిపిస్తారట. స్పోర్ట్స్ పర్సన్ గా చిరు చాలా తక్కువ సినిమాలు చేసారు. గతంలో ఫుట్ బాల్ ప్లేయర్ గా విజేతలో, స్టూడెంట్ గైడ్ గా మాస్టర్ లో కనిపించారు. అంతే ఈ రెండు తప్ప ఏమి చేయలేదు. ఇప్పుడు ఇందులో కోచ్ ప్లస్ ఫామిలీ పర్సన్ గా చిరు రోల్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోందట.

డ్యూయల్ రోల్….

మరోపక్క ఇందులో చిరు డ్యూయల్ రోల్ అనే న్యూస్ అయితే గట్టిగా ప్రచారంలో ఉంది. ఇక ఈమూవీ లో హీరోయిన్ ఎంపిక పూర్తి చేసి త్వరలోనే ప్రకటించబోనున్నారు. అనుష్క-నయనతార-ఐశ్వర్యా రాయ్- శృతి హాసన్ అని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇది ఇలా ఉండగా తమిళంలో విజయ్ హీరోగా అట్లీ తీస్తున్న చిత్రం లో కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండటం గమనార్హం.

Tags:    

Similar News