బాలీవుడ్ దిగ్గజం తో.. టాలీవుడ్ దిగ్గజం

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సూపర్ హిట్ హీరో. ఆయనకు బాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్, ఒక లగాన్, దంగల్ లాంటి సినిమాల్తో ప్రేక్షకుల మదిలో [more]

Update: 2019-04-07 08:18 GMT

బాలీవుడ్ లో అమీర్ ఖాన్ సూపర్ హిట్ హీరో. ఆయనకు బాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్, ఒక లగాన్, దంగల్ లాంటి సినిమాల్తో ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించిన స్టార్. ఇక టాలీవుడ్ లో సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్లి మళ్ళీ సినిమాలోకి వచ్చినా. ఇప్పటికి… అయనని అభిమానులు నెంబర్ వన్ హీరోగానే చూస్తున్నారు. ఆయనే మెగా స్టార్ చిరు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో చిరంజీవి దిగిన ఫోటో సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

ఒకరు బాలీవుడ్ దిగ్గజం, మరొకరు టాలీవుడ్ దిగ్గజం అంటూ మెగా అభిమానులు ఆ ఫోటో ని క్షణాల్లో వైరల్ చేసేసారు. ఇంతకీ ఈ దిగ్గజాలిద్దరు కలిసి ఎక్కడ ఫోటో దిగారో తెలుసా…. జపాన్ లోని క్యోటో విమానాశ్రయంలో ఒకరినొకరు కలిశారు. ప్రస్తుతం సై రా నరసింహారెడ్డి షూటింగ్ జపాన్ లో జరుగుతుండగా.. అక్కడికి చిరు భార్య సురేఖ కూడా వెళ్లడంతో.. షూటింగ్ గ్యాప్ లో చిరు, సురేఖ తో విహారయాత్రచేస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్ కూడా జపాన్ లోనే ఉండడం వీరిరువురు జపాన్ లోని క్యోటో విమానాశ్రయంలో కలుసుకోవడం జరిగింది.

అయితే క్యోటో విమానాశ్రయంలో చిరు ని కలిసిన అమీర్ ఖాన్ నా ఫేవరేట్ నటుల్లో ఒకరైన చిరంజీవిని క్యోటో విమానాశ్రయంలో కలిశాను. వాట్ ఎ సర్‌ప్రైజ్ ? ఆయన నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా గురించి, ఫ్రీడం ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చిరుతో చర్చించా… అని ట్వీట్ చేసిన ఆమిర్.. మీరు ఎప్పుడూ మాకు ఇన్స్పిరేషన్ సర్..లవ్.. అని పేర్కొన్నాడు. మరి చిరు ని అమీర్ అలా పొగడడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది.

Tags:    

Similar News