అల్లుడికి అతి విలువైన సలహా ఇచ్చిన మెగాస్టార్

Update: 2018-08-12 15:00 GMT

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ మొగుడు కల్యాణ దేవ్ విజేత సినిమాతో హీరోగా మారిపోయాడు. బిజినెస్ మ్యాన్ గా వున్న కళ్యాణ్ దేవ్ కి శ్రీజ ని పెళ్లాడిన తర్వాత హీరో గా మారాలని.. సెలెబ్రిటీ హోదా అనుభవించాలని కోరికతో హీరోగా మారిపోయాడు. మొదటి సినిమాని చాలా సింపుల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథతో కుటుంబ కథా చిత్రాన్ని చేసాడు. ఆ సినిమాని ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. మెగా ఫ్యామిలీ మొత్తం అంటే చిరు,అల్లు అరవింద్, రామ్ చరణ్ లాంటి మెగా హీరోలంతా కళ్యాణ్ దేవ్ కి సపోర్ట్ గా నిలబడ్డారు. ఇకపోతే కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ మొదలు పెట్టాలనే యోచనలో ఉన్నాడట.

అయితే విజేత సినిమా విషయంలో దెబ్బతిన్నట్టుగా.. మళ్ళీ హడావిడిగా నెక్స్ట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టేసి ఇబ్బంది పడొద్దని కళ్యాణ్ కి మామగారు చిరంజీవి కొన్ని సలహాలతో కూడిన సూచనలు ఇచ్చాడట. రెండో సినిమా కి కొద్దిగా కాదు కొంచెం ఎక్కువ టైం తీసుకో.. అంతేకాని హడావిడి పడి రెండో సినిమాని స్టార్ట్ చెయ్యకు... ఎందుకంటే ముందుగా నువ్వు నటనలో ఇంకా మెళుకువలు నేర్చుకో.. అలాగే డ్యాన్స్, యాక్షన్ సీన్స్‌లో మరింత మెచ్యూరిటీ అవసరం…కనుక వాటిమీద ఫోకస్ పెట్టు. ఇవన్నీ చూసుకునే తర్వాతే నీ రెండో సినిమాని స్టార్ట్ చెయ్యి... అంటూ చిరంజీవి చిన్నల్లుడి కళ్యాణ్ దేవ్ కి ఒక క్లాస్ లాంటి మంచి సలహా ఇచ్చాడట.

కళ్యాణ్ దేవ్ అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటే.. తానే ఒక మంచి అనుభవం ఉన్న డైరెక్టర్ చేతిలో పెట్టడానికి చిరంజీవి సన్నద్ధమవుతున్నాడట. విజేత సినెమాలా కాకుండా ఈసారి వచ్చే సినిమా సూపర్ హిట్ కొట్టే విధంగా మాంచి అనుభవం, క్రియేటివిటీ కలిగిన ఓ దర్శకుడి చేతిలో కళ్యాణ్ దేవ్ ని పెట్టాలని కూడా చిరంజీవి డిసైడ్ అయ్యాకే ఇలా చిన్నల్లుడికి సలహాలు ఇచ్చాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది.

Similar News