చిన్మయి 1.5 లక్షలు చెల్లించి..క్షమాపణలు చెప్పాలంట

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కొన్ని నెలలు నుండి ‘మీటూ’ ఉద్యమంపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది సినీ ప్రముఖులపై చిన్మయి ఆరోపణలు చేయడంతో..ఆమె రెండేళ్లుగా [more]

Update: 2018-12-30 11:46 GMT

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కొన్ని నెలలు నుండి ‘మీటూ’ ఉద్యమంపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది సినీ ప్రముఖులపై చిన్మయి ఆరోపణలు చేయడంతో..ఆమె రెండేళ్లుగా వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించలేదన్న కారణంతో తమిళ డబ్బింగ్ యూనియన్ నుంచి ఆమెను తప్పించడం చేసారు. దాంతో ఈ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కొంతమంది సినీ ప్రముఖులు ఆమెపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలా చేశారని భావిస్తున్నారు.

ఆమె గత కొన్ని నెలలు నుండి యూనియన్‌పై పోరాడుతూనే ఉంది. అటు యూనియన్‌ వారు కూడా ఏమి తగ్గట్లేదు. ఆమెను తిరిగి యూనియన్ లో కి తీసుకోవాలంటే 1.5 లక్షల జరిమానా కట్టాలని, అలాగే యూనియన్ అధ్యక్షుడు రాధా రవికి క్షమాపణలు చెప్పాలని అప్పుడే ఆమెను యూనియన్ లోకి తీసుకుంటాం అని చెప్పారట. ఈ విషయాన్నీ చిన్మయే స్వయంగా తన ట్విట్టర్లో వెల్లడించింది.

నాకు యూనియన్ వారు ఒక లేఖ పంపారు అందులో నేను రూ.1.5 లక్షలు చెల్లించడంతో పాటు క్షమాపణలు చెప్పాలని పంపారు. ఆ తరువాతే నన్ను యూనియన్‌లోకి తీసుకుంటామని అంటున్నారు. ఆల్రెడీ యూనియన్ 2006 నుండి నా వద్ద చాలా డబ్బులు తీసుకుంది. ఇప్పుడు మళ్ళి నేను డబ్బులు ఇవ్వాలంట. ఇది ఎక్కడి న్యాయమో నాకు అర్ధం కావట్లేదు. డబ్బింగ్‌ యూనియన్‌ చట్టం ప్రకారం అందులో సభ్యత్వం పొందాలంటే 2500 రూపాయలు చెల్లించాలి. కానీ వీరు రూ.1.5 లక్షలు చెల్లించి.. క్షమాపణ చెప్పాలి అంటున్నారు అని తన ట్విట్టర్ లో పేర్కొంది. అంతకముందు చిన్మయి తనకు ఇంకా తమిళంలో డబ్బింగ్ చెప్పను అని చెప్పింది

Tags:    

Similar News