సుశాంత్ " చిలసౌ".. విడుదల తేదీ..!

Update: 2018-07-26 08:23 GMT

సుశాంత్, రుహాణి శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'చిలసౌ'.. నటుడు రాహుల్ రవీంద్రన్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందింది. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి రుహాణి శర్మ అనే కొత్త అమ్మాయి పరిచయం కాబోతుంది.. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రోహిణి మరియు అను హసన్ లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. భరత్ కుమార్ మాలాసల, హరి పులిజల మరియు జస్వంత్ నదిపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ, సిరునీ సినీ కార్పొరేషన్ బ్యానర్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఆఫీసియల్ గా ప్రకటించింది చిత్ర బృందం.

తారాగణం

సుశాంత్, రుహనీ శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్ మరియు జయప్రకాష్.

Similar News