సినిమా బాగుంది కానీ...?

Update: 2018-08-06 06:55 GMT

ఒక మంచి సినిమా ఈ రోజుల్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం అయిపోయింది. ఆ సినిమా సక్సెస్ అవ్వాలంటే ఒకటి ఆ హీరోకి ఇమేజ్ ఉండాలి లేదా అతనికి మార్కెట్ ఉండాలి. ఈ రెండు లేకపోతే సినిమా ఎంత బాగున్నా వసూళ్లపరంగా సక్సెస్ అవ్వలేదు. అటువంటి పరిస్థితే రీసెంట్ గా రిలీజ్ అయిన చిలసౌ కి వచ్చింది.

కొత్త సినిమాల ప్రభావం పడనుందా..?

రిలీజ్ అయిన మొదటి రోజు టాక్ ఎంత బాగుంది అన్నా..రివ్యూస్ ఎంత బాగా వచ్చినా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి రోజు కేవలం 40 లక్షల షేర్ మాత్రమే తీసుకురావడం నిర్మాతలను నిరాశకు గురి చేస్తోంది. వీకెండ్ కావడంతో నిన్న, ఈరోజు పర్లేదు అనిపించుకున్నా సోమవారం నుండి ఈ సినిమాకు కఠిన పరీక్ష తప్పదు. ఏమన్నా లక్కుంటే నెక్స్ట్ వీక్ లోపు లాక్కోవాలి. ఎందుకంటే వచ్చే వారం రెండు సినిమాల రిలీజ్ ప్రభావం ఈ సినిమాపై పడుతుంది.

హిట్ అనిపించుకునేనా..?

శ్రీనివాస కళ్యాణంతో పాటు విశ్వరూపం 2 సినిమాలు ఈ వారం రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ సినిమాకు అన్నపూర్ణ సంస్థ అండదండలు ఉన్నా ఇలా జరగడం ఆశ్చర్యమే. ప్రొమోషన్స్ కూడా ఈ సినిమాకు అంతగా చేసినట్టు కనిపించలేదు. కేవలం సోషల్ మీడియాలో తప్ప ఈ సినిమా గురించి ఎక్కడ డిస్కస్ చేయడం లేదు. అందుకే జనాలు ఈ సినిమాకు అంతగా కనెక్ట్ కాకపోవడం కూడా మైనస్ గా నిలిచింది. సినిమాను 8 కోట్లకు పైగా బిజినెస్ చేసారు. మరి ఈరోజు నుండి పుంజుకుంటే తప్ప చిలసౌ హిట్ అనిపించుకునే అవకాశం లేదని చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు.

Similar News