చెర్రీ.. కియారా ల వర్కౌట్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

Update: 2018-05-20 08:08 GMT

రామ్ చరణ్ - కియారా అద్వానీ కాంబినేషన్ లో బోయపాటి ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండవ షెడ్యూల్ కోసం టీం మొత్తం బ్యాంకాక్‌ వెళ్లారు. చరణ్ తో పాటు అతని వైఫ్ ఉపాసన కూడా వెళ్లారు. ఆమె రెగ్యులర్ గా చరణ్ కు సంబంధించి వీడియోస్ తీసి సోషల్ మీడియాలో తన అకౌంట్ లో పోస్ట్ చేయడం అలవాటు.

అదే విధంగా బ్యాంకాక్‌ లో రామ్ చరణ్ కు సంబంధించిన వీడియోను ఒకటి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ షూటింగ్ గ్యాప్ లో రామ్ చరణ్ కు విశాంత్రి దొరకడంతో అక్కడి ఓ చెరువులో చెర్రీ చేపలకు ఆహారం వేయగా అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అలాగే చరణ్, కియారా అద్వానీల జిమ్ లోని వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో చరణ్ తో పోటీగా కియారా కూడా వర్కౌట్స్ చేస్తూ ఆకట్టుకుంది.

బోయపాటి బ్యాంకాక్‌లో చరణ్ పై..కియారా పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. బ్యాంకాక్‌ షెడ్యూల్ తో దాదాపు సినిమా షూటింగ్ 70 % కంప్లీట్ చేయనున్నాడు. అయితే ఇంకా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. మరో రెండు వారాల్లో డేట్ ను ఓఫిషల్ గా అనౌన్స్ చేయనున్నారు.

Similar News