‘చెన్నకేశవరెడ్డి’ రిపీట్ అవుతుందా..?

Update: 2018-12-21 08:26 GMT

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ప్రమోషన్స్ తాలూకు విషయంలో బాలకృష్ణ బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా 'ఎన్టీఆర్ కథానాయకుడు', ఫ్రిబ్రవరి 7న 'ఎన్టీఆర్ మహానాయకుడు' రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా తరువాత బాలయ్య వి.వి.వినాయక్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఎప్పటి నుండో వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది.. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని వార్తలు వచ్చాయి. వినాయక్ కన్నా ముందు బాలకృష్ణ బోయపాటితో సినిమా చేద్దాం అని తన మార్క్ కథను రెడీ చేయమని బోయపాటికి చెప్పాడట. చాన్నాళ్లుగా బాలకృష్ణ కోసం బోయపాటి కాచుకుని కూర్చున్నాడ్డు. కానీ బాలయ్య బయట డైరెక్టర్స్ కి ఛాన్స్ లు ఇస్తూ బోయపాటిని పక్కన పెట్టాడు.

వినాయక్ తో సినిమా కన్ ఫర్మ్

అయితే బోయపాటి... బాలయ్య కోసం వెయిట్ చేసి చేసి చరణ్ తో కమిట్ అయ్యాడు. ఇక చరణ్ సినిమా పనుల్లో బోయపాటి తలమునకలయ్యాడు. అందుకే బోయపాటి 'వినయ విధేయ రామ' పనులతో బిజీగా ఉండడంతో కథను రెడీ చేయలేకపోయాడు. ఆ విషయాన్నే బాలకృష్ణకి చెప్పినట్టుగా సమాచారం. దాంతో వినాయక్ లైన్ లోకి వచ్చాడు. బాలకృష్ణకి ఓ కథ చెబితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రెడీ చేసుకుని రమ్మని బాలయ్య చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే వీరి కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించనున్నారు. వినాయక్ - బాలయ్య కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'చెన్నకేశవరెడ్డి' ఎంత హిట్ తెలిసిందే. దీంతో ఈ సినిమా స్టార్ట్ అవ్వకుండానే అంచనాలు పెరిగిపోయాయి. మరి వినాయక్ బాలయ్యను ఎలా చూపిస్తాడో చూడాలి.

Similar News