చరణ్ బ్రేక్ అందుకేనా?

కరోనా లాక్ డౌన్ టైం లో ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు షూటింగ్ తో బిజీ బిజీగా వున్నాడు.  రామ్ చరణ్ [more]

Update: 2020-11-30 07:20 GMT

కరోనా లాక్ డౌన్ టైం లో ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేసిన రామ్ చరణ్ ఇప్పుడు షూటింగ్ తో బిజీ బిజీగా వున్నాడు.  రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న RRR సినిమా షూటింగ్ ని రాజమౌళి రాత్రీపగలూ చిత్రీకరిస్తున్నాడు. కరోనా తో టైం వెస్ట్ అవడంతో రాజమౌళి ఇప్పుడు షూటింగ్ కి బ్రేక్ లేకుండా తాను కష్టపడడమే కాదు.. అందరిని కష్టపెడుతున్నాడు కూడా. అయితే ఎన్టీఆర్ కాంబో సీన్స్ లేకపోవడంతో ఎన్టీఆర్ ఈమధ్యనే తన భార్య పిల్లలతో చిన్నపాటి వెకేషన్ ప్లాన్ చేసుకుని దుబాయ్ ట్రిప్ వేసాడు. కానీ రామ్ చరణ్ మాత్రం RRR షూటింగ్ కి హాజరవుతున్నాడు. RRR షూటింగ్ ఎంత త్వరగా ఫినిష్ అయితే అంత త్వరగా రామ్ చరణ్ చిరు ఆచార్య షూటింగ్ కి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.

అయితే తాజాగా రామ్ చరణ్ RRR షూటింగ్ కి బై బై చెప్పబోతున్నాడట. కొద్దిపాటి విరామంతో చరణ్ మళ్ళీ RRR షూటింగ్ లో హాజరవుతాడట. బిజీ షెడ్యూల్ టైమ్ లో రామ్ చరణ్ ఇప్పుడు RRR షూటింగుకి బ్రేకిస్తున్నాడంటే ఉపాసనతో జాలి ట్రిపో.. లేదంటే మరేదన్నానో కాదు.. రామ్ చరణ్ RRR షూటిగ్ కి బ్రేకిచ్చేది చెల్లాయ్ పెళ్లి కోసం.. చరణ్ ఇప్పటికే రాజమౌళి దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాడట. బాబాయ్ కూతురు నీహారిక పెళ్లి రాజస్థాన్ లో డిసెంబర్ 9 న ఉదయ్ ప్యాలెస్ లో జరగబోతుంది. అందుకు గాను రామ్ చరణ్ ఓ నాలుగు రోజుల పాటు RRR షూటింగ్ నుండి బ్రేక్ తీసుకోబోతున్నాడట. నిహారిక సంగీత్, మెహిందీ వేడులతో పాటుగా పెళ్లి కూతురు ఫంక్షన్, అలాగే పెళ్లి కి అన్న చరణ్ లేకుండా ఎలా.. అందుకే రామ్ చరణ్ ఎన్టీఆర్ లా వెకేషన్ ప్లాన్ చేసుకోకుండా ఆ బ్రేక్ ని ఇలా నిహారిక పెళ్లి కోసం వాడుకుంటున్నాడట. 

Tags:    

Similar News