RRR కి హ్యాండ్.. ఆచర్యకి గ్రీన్ సిగ్నల్?

ప్రస్తుతం హీరోలంతా షూటింగ్ కోసం వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. నిన్నటివరకు షూటింగ్ అంటే అమ్మో కరోనా అన్నారు. కానీ మిగతా భాషల హీరోలు [more]

Update: 2020-08-27 08:16 GMT

ప్రస్తుతం హీరోలంతా షూటింగ్ కోసం వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. నిన్నటివరకు షూటింగ్ అంటే అమ్మో కరోనా అన్నారు. కానీ మిగతా భాషల హీరోలు షూటింగ్స్ కోసం బయలుదేరాక మన హీరోలు కాస్త ధైర్యం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో అందరికన్నా ముందు రామ్ చరణ్ షూటింగ్ కి బయలుదేరాలా కనిపిస్తున్నాడు. హీరోలంతా లాక్ డౌన్ లో సినిమాల మీద సినిమాలు లైన్ లో పెడుతుంటే చరణ్ మాత్రం కొత్త సినిమాల విషయంలో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. అయితే నిన్నమొన్నటివరకు షూటింగ్ అంటే అమ్మో అన్న చరణ్ ఇప్పుడు షూటింగ్స్ కి సన్నద్ధం అవుతున్నాడట. అయితే రామ్ చరణ్ నటిస్తున్న RRR కోసం రామ్ చరణ్ షూటింగ్ చెయ్యడానికి రెడీ కాలేదు.

ఆయన గెస్ట్ రోల్ చేస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కోసం చరణ్ కరోనని లెక్క చెయ్యను అని అంటున్నాడట. రాజమౌళి RRR లో ఫుల్ లెన్త్ రోల్ కాబట్టి.. ఎక్కువ రోజులు షూటింగ్ చెయ్యాలి. అదే ఆచార్య అయితే జస్ట్ గెస్ట్ రోల్ కాబట్టి కొన్ని రోజులు షూటింగ్ కి వెళితే అయ్యిపోతుంది. అందుకే ముందు రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ కి ఓకె చెప్పాడని.. RRR షూటింగ్త లో ర్వాత పాల్గొంటానని రాజమౌళి దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మరి హీరోలందరిలో రామ్ చరణే కెమెరా ముందుకు రావడానికి రెడీ అవుతున్న ఫస్ట్ హీరో అన్నమాట.

Tags:    

Similar News