చరణ్ మేకోవర్ దానికోసమేనా?

రామ్ చరణ్ పుట్టిన రోజునాడు రాజమౌళి RRR నుండి చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్ ని పరిచయం చేసాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కండలు [more]

Update: 2020-09-25 05:57 GMT

రామ్ చరణ్ పుట్టిన రోజునాడు రాజమౌళి RRR నుండి చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర టీజర్ ని పరిచయం చేసాడు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కండలు పెంచి.. అద్భుతమైన మీసకట్టుతో, నున్నటి షేవింగ్ తో అదరగొట్టాడు. ఇక రామ్ చరణ్ అల్లూరి లుక్ అందరికి తెలిసిపోయింది. అయితే రామ్ చరణ్ కరోనా లాక్ డౌన్ లో అల్లూరి సీతారామరాజు లుక్ నుండి మారిపోయి.. గెడ్డం బాగా పెంచి.. మళ్ళీ రంగస్థలం లోని చిట్టి బాబు ని గుర్తు చేసాడు. తాజాగా జిమ్ లోను రామ్ చరణ్ గెడ్డం లోక్ లోనే ఉన్నాడని ఆయన పెట్టుకున్న మాస్క్ చూస్తే తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ అల్లూరి లుక్ నుండి బయటికి వచ్చి గెడ్డం గట్రా పెంచి కొత్త మేకోవర్ అవడానికి కారణముందట.

అది రామ్ చరణ్ చిరంజీవి ఆచార్య లో ఓ కీలక పాత్ర చెయ్యబోతున్నాడు. కొరటాల – చిరు కాంబోలో తెరకెక్కనున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మాస్ పాత్రలో కనిపిస్తాడని.. అందుకే చరణ్ గెడ్డం అవి పెంచి రఫ్ గా తయారయ్యాడని.. అందుకు సంబందించిన ఫోటో షూట్ కూడా కొరటాల మొదలెట్టబోతున్నాడని టాక్. ఆచార్య షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చెయ్యడంతో ముందు రామ్ చరణ్ ఫోటో షూట్ నిర్వహించి.. లుక్ టెస్ట్ చేసాక.. రంగంలోకి దిగాలని ప్లాన్ లో ఆచార్య టీం ఉందట. చ‌ర‌ణ్ ఎలాంటి గెట‌ప్‌లో క‌నిపిస్తే బాగుంటుందో… కొర‌టాల ఊహించి ఇప్పటికే కొన్ని స్కెచ్‌లు త‌యారు చేయించాడ‌ట‌. అందులో భాగంగానే చరణ్ కొత్త మేకోవర్ అంటున్నారు. కొరటాల చెప్పినట్టుగా రామ్ చరణ్ గెట‌ప్ కి త‌గిన‌ట్టుగా మారా‌డ‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News