చరణ్ సినిమా టైటిల్ ఇదేనా..?

Update: 2018-09-25 08:48 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిసారిగా రామ్ చరణ్.. బోయపాటి డైరెక్షన్ యాక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే షూటింగ్ మొదలై చాలా నెలలు అవుతున్నా ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించి సింగల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేదు టీం. కనీసం టైటిల్ కూడా ఫిక్స్ చేయలేదు. దసరా కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే ఇంతవరకు టైటిల్ పై ఎలాంటి క్లూ లూ దొర‌క‌లేదు.

స్టేట్ రౌడీ గా చరణ్..?

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి 'స్టేట్‌రౌడీ' అనే టైటిల్ ను పెట్టాలని బోయపాటి ఫిక్స‌యిన‌ట్టు స‌మాచారం. గతంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా 'స్టేట్ రౌడీ' అనే సినిమా వచ్చి మాస్‌ని ఆకట్టుకుందని తెలిసిన సంగతే. ఇప్పుడు అదే టైటిల్ తో చరణ్ వస్తున్నాడు. చరణ్ ఇప్పటివరకు చిరు సాంగ్స్ మాత్రమే వాడుకున్నాడు. కానీ తొలిసారిగా చిరు టైటిల్ ను వాడుకోనున్నాడు. మరి టైటిల్ కి తగ్గట్టే ఇందులో చరణ్ పాత్ర ఉంటుందా.? అనే ప్రశ్నకు సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. మరి ఈ టైటిల్ నిజమో కాదో తెలియాలంటే అక్టోబ‌రు 19న రిలీజ్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు ఆగాల్సిందే.

Similar News