చిరు – చరణ్ లు రాంగ్ స్టెప్ వేసారా?

చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి.. రామ్ చరణ్ తో కలిసి సినిమాలను ఎంచుకోవడం, దర్శకులను లైన్ లో పెట్టడం చేస్తున్నాడు. చిరుకి వినాయక్ ని ఖైదీ [more]

Update: 2020-04-17 01:44 GMT

చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటినుండి.. రామ్ చరణ్ తో కలిసి సినిమాలను ఎంచుకోవడం, దర్శకులను లైన్ లో పెట్టడం చేస్తున్నాడు. చిరుకి వినాయక్ ని ఖైదీ నెంబర్ 150 కి తగిలించింది చరణే. ఇక ధ్రువ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి తో తన తండ్రి కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైరా చేయించాడు. ఇక రామ్ చరణ్ కోసం వచ్చిన కొరటాలకు చిరు ఆచార్య సినిమా తగిలించాడు. తాజాగా సాహో దర్శకుడు సుజిత్ రామ్ చరణ్ కోసం కథ తెస్తే.. చిరు తో లూసిఫెర్ రీమేక్ చెయ్యాలని సూచించాడు. చిరు కోసం మలయాళ లూసిఫెర్ హక్కులు కొన్న రామ్ చరణ్.. ఆ సినిమా కోసం సుకుమార్ దగ్గరనుండి, దర్శకుడు బాబీ వరకు పేర్లు పరిశీలించినప్పటికీ.. చివరికి సాహో దర్శకుడు సుజిత్ లూసిఫెర్ రీమేక్ దర్శకుడుగా ఎంపికయ్యాడు.

 ఈ విషయాన్నీ తాజాగా చిరంజీవే కన్ఫర్మ్ చేసాడు. లూసిఫ‌ర్ రీమేక్ కోసం సుజీత్‌తో క‌లిసి ప‌ని చేయాల‌ని రామ్ఈ చరణ్ త‌న‌కు సూచించిన‌ట్లు చిరు వెల్ల‌డించాడు. ఈ సినిమా కి చరణే నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పాడు. ప్రస్తుతం సుజిత్ లూసిఫెర్ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని.. తెలుగు నేటివిటీకి సంబందించిన కొన్ని మార్పులు చేస్తున్నాడని చిరు చెబుతున్నాడు. అయితే మెగా ఫాన్స్ కి సుజిత్ లూసిఫెర్ రీమేక్ దర్శకుడు అనగానే కాస్త టెంక్షన్ పడుతున్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో సాహో సినిమా చేసిన సుజిత్.. ఆ సినిమా తో ఘోరంగా విఫలమయ్యాడు. అలంటి దర్శకుడిని నమ్మి చిరు లూసిఫెర్ రీమేక్ ఎలా పెట్టారు అంటున్నారు. చరణ్ – చిరు ఈ విషయంలో రాంగ్ స్టెప్ వేసారేమో అంటున్నారు వాళ్ళు. లూసిఫ‌ర్ లాంటి రాజ‌కీయాలు, సెంటిమెంట్ల చుట్టూ తిరిగే థ్రిల్ల‌ర్ మూవీని సుజిత్ ఎలా డీల్ చేస్తాడ‌న్న‌ది మెగా ఫాన్స్ లో అనుమానంగానే ఉందట. 

Tags:    

Similar News