తమిళ ‘అర్జున్ రెడ్డి’లో అన్నీ మార్చేస్తున్నారు

తెలుగులో విజయ్ దేవరకొండ – షాలిని పాండే హీరో హీరోయిన్స్ గా నటించిన అర్జున్ రెడ్డి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే [more]

Update: 2019-02-16 07:07 GMT

తెలుగులో విజయ్ దేవరకొండ – షాలిని పాండే హీరో హీరోయిన్స్ గా నటించిన అర్జున్ రెడ్డి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇదే అర్జున్ రెడ్డి తమిళంలో హీరో విక్రమ్ తన కొడుకు ధృవ్ ని హీరోగా తెరకు పరిచయం చేస్తూ బాల దర్శకత్వంలో వర్మ అనే పేరుతొ రీమేక్ చేయించాడు. వర్మ సినిమాలో ధృవ్ కి జోడిగా బెంగాలీ భామ మేఘ చౌదరి నటించింది. అయితే వర్మ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు దగ్గరపడిన సమయంలో అవుట్ పుట్ చూసిన నిర్మాతలు వర్మ సినిమాని మళ్లీ రీ షూట్ చెయ్యాలని నిర్ణయించారు. అయితే రీ షూట్స్ విషయంలో విభేదాలు రావడంతో దర్శకుడు బాల ఆ సినిమా నుండి తప్పుకున్నాడు.

కొత్త హీరోయిన్…

ఇక రీ షూట్స్ మాత్రమే కాదు.. తాజాగా ధృవ్ సరసన హీరోయిన్ గా నటించిన మేఘ చౌదరిని కూడా సినిమా నుండి తపించారు. ధృవ్ కి జోడిగా వర్మలో నటించిన మేఘ చౌదరిని తీసేసి తాజాగా మరో హీరోయిన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా దర్శకుడు సెట్ కాలేదు కానీ.. అప్పుడే ధృవ్ కి హీరోయిన్ ని సెట్ చేశారట. వర్మ సినిమాలో ధృవ్ కి జోడిగా హిందీ హీరోయిన్ భణిత సంధుని సెలక్ట్ చేసి ఫైనల్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలో లిప్ లాక్ ముద్దులకు భణిత సంధు సై అనడంతోనే వర్మ సినిమాకి ఈ అమ్మాయిని ఓకె చేశారట. హీరో మినహా అందరినీ తప్పించి కొత్త వారిని తీసుకోవాలనుకుంటున్నారు నిర్మాతలు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మార్చ్ ఫస్ట్ వీక్ నుండి ధృవ్ సినిమా రీ షూట్ మొదలు పెడతారని తెలుస్తుంది.

Tags:    

Similar News