కరోనా ఎఫెక్ట్: బిగ్ బాస్ లో చేంజెస్!!

ప్రస్తుతం కరోనా వలన మళ్ళీ మొదలైన సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. కరోనా కరోనా అంటూ అనుమతులు లభించినా షూటింగ్ చెయ్యలేని పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా [more]

Update: 2020-06-26 08:06 GMT

ప్రస్తుతం కరోనా వలన మళ్ళీ మొదలైన సీరియల్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. కరోనా కరోనా అంటూ అనుమతులు లభించినా షూటింగ్ చెయ్యలేని పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా బుల్లితెర మీద బిగ్ రియాలిటీ షో కుడా కరోనా ఎఫెక్ట్ కి బలయ్యేలా ఉంది అనే టాక్ తాజాగా సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. బిగ్ బాస్ ఇంట్లో ఒకేచోట కంటెస్టెంట్స్ ని పెట్టడం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుదిరే పని కాదు. సో ఈ ఏడాది బిగ్ బాస్ ఆగష్టు నాటికీ మొదలైతే.. ఓకె లేదంటే లేదు అంటూ ప్రచారం షురూ అయ్యింది. అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ 4 కి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూన్నాయని.. కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా రెడీ అయ్యింది అని… కాకపోతే బిగ్ బాస్ సీజన్ 4 లో భారీ మార్పులు ఉండబోతున్నాయని అంటున్నారు.

అందులో ముఖ్యంగా బిగ్ బాస్ ఎప్పటిలాగా 100  రోజులు ఉండదని.. దానిలో సగం అంటే కేవలం ఈ షో 50 రోజుల పాటే డిజైన్ చేసారని అంటున్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్ ల ఇషయంలో కూడా భారీ మార్పులు చేయబోతున్నారని.. అలాగే గతంలోలా ఈ ఏడాది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లోను కోత పెట్టారని..ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 లో కేవలం 12 మందే ఉండబోతున్నారని అంటున్నారు. గతంలో 14 నుండి 17 మంది కంటెస్టెంట్స్ ఉండేవారు. సామజిక దూరం పాటిస్తూ ఉండే టాస్క్ లను షో కోసం డిజైన్ చెయ్యడంతో పాటుగా… ఒక్కో కంటెస్టెంట్ కి ఒక్కో బాత్ రూమ్, అలాగే ఒక్కో వాషింగ్ మేషన్ తో పాటుగా.. పడుకునే బెడ్స్ దూరం కూడా పెంచబోతున్నారట. సెట్ సెటప్ ఎప్పుడో పూర్తయిన… ప్రస్తుత బిగ్ బాస్ హౌస్ లో మార్పులు కీలకం ఉంటున్నాయని… బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెండ్ ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని యాజమాన్యం చెబుతుందట. 

Tags:    

Similar News