చంద్రముఖి సీక్వెలా… నాకు తెలియదే!!

పి వాసు దర్శకత్వంలో రజినీకాంత్ – జ్యోతిక – నయనతార – ప్రభు కాంబోలో తెరకెక్కిన చంద్రముఖి అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమాలో [more]

Update: 2020-05-23 06:01 GMT

పి వాసు దర్శకత్వంలో రజినీకాంత్ – జ్యోతిక – నయనతార – ప్రభు కాంబోలో తెరకెక్కిన చంద్రముఖి అప్పట్లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆ సినిమాలో రజినీకాంత్ నటనకన్నా గంగ గా చంద్రముఖిగా జ్యోతిక చేసిన నటనే హైలెట్ అనేలా ఉంది. నయనతార రెండు పాటలకే పరిమితమైనప్పటికీ.. చీర కట్టులో అదరగట్టింది. అయితే తాజాగా చంద్రముఖి కి సీక్వెల్ అంటూ ఓ న్యూస్ ఎప్పటినుండో కోలీవుడ్ మీడియాలో వినబడుతుంది. కేవలం ప్రచారం మాత్రమే కాదు.. చంద్రముఖి సీక్వెల్ ఉంటుంది అని అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే చంద్రముఖిలో నటించిన నటీనటులు చంద్రముఖి 2 లో నటిస్తారో లేదో ఎవ్వరికి క్లారిటీ లేదు.

అయితే తాజాగా చంద్రముఖిలో వారై అంటూ ఓ పాటలో రెచ్చిపోయి నాట్యం చేసిన జ్యోతిక చంద్రముఖి సీక్వెల్ గురించి మాట్లాడింది. అసలు చంద్రముఖి సీక్వెల్ ఉందా? ఉంటే ఆ విషయం తనకి తెలియదని.. అసలు చంద్రముఖి సీక్వెల్ గురించి తననెవరూ సంప్రదించలేదని చెప్పింది. అంటే చంద్రముఖి సీక్వెల్ లో చంద్రముఖి నటీనటులు ఉంటారనేది ఇంకా స్పష్టతలేదు. అసలు లేరేమో అనే అనుమానము కలుగుతుంది అంటున్నారు.

Tags:    

Similar News