చంద్రబాబు ని ఇరకాటంలో పెట్టిన వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతుంది. ఇందులో చంద్రబాబుని వర్మ పూర్తిగా నెగటివ్ షేడ్స్ తో చూపించనున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరీ [more]

Update: 2019-03-22 10:18 GMT

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతుంది. ఇందులో చంద్రబాబుని వర్మ పూర్తిగా నెగటివ్ షేడ్స్ తో చూపించనున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ స్టోరీ మొత్తం మనకు తెలిసిందే. ఈ సినిమా ఎఫెక్ట్ ఓటర్లపై ఎక్కడ పడుతుందోనని భావించి టీడీపీ ఈ సినిమాను ఆపాలంటూ కోర్టుకి ఎక్కింది. కానీ ఫలితం లేదు. ఆ కేసును కోర్టు కొట్టేసింది. దీంతో మిగిలిన మార్గాల్లో సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వర్మ ఒక ట్వీట్ తో చంద్రబాబుని భలే లాక్ చేసాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ పై ట్విట్టర్ లో వర్మ స్పందించాడు.

ఒక్క ట్వీట్ చేసి…

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని, చంద్రబాబు సీఎంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని.. ఆయనే దగ్గరుండి సినిమా రిలీజ్ అయ్యేలా చూస్తారని అన్నాడు. లాస్ట్ లో జై చంద్రబాబు అంటూ తనదైన శైలి వర్మ కౌంటర్ ఇచ్చాడు. అలా చంద్రబాబు.. వర్మ చేసిన ట్వీట్ కి లాక్ అయ్యారు. సినిమాను ఆపితే తనకు బ్యాడ్ నేమ్ వస్తుంది.. ఆపకపోయినా బ్యాడ్ నేమ్ వస్తుంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News