వార్ థియేటర్స్ చాణిక్యకి ఇస్తారా

దసరాకు వరుస సెలవులు రావడంతో సైరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెలవుల్లో వచ్చిన మొదటి సినిమా ఇదే. హిట్ టాక్ తో థియేటర్స్ లో దుమ్మురేపుతున్న [more]

Update: 2019-10-04 06:04 GMT

దసరాకు వరుస సెలవులు రావడంతో సైరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెలవుల్లో వచ్చిన మొదటి సినిమా ఇదే. హిట్ టాక్ తో థియేటర్స్ లో దుమ్మురేపుతున్న సైరా సినిమాకి పోటీగా ఈ శనివారం గోపీచంద్ చాణక్య, శ్రీనివాస్ అవసరాల ఊరంతా అనుకుంటున్నారు. ఈ సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. సైరా సినిమా హిట్ అవడంతో చాణక్య, ఊరంతా అనుకుంటున్నారు టీం టెన్షన్ పడడమే కాదు చాణక్య సినిమాకైతే హైదరాబాద్‌లో కేవలం నాలుగు థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ చేసారంటే థియేటర్స్ మొత్తం సైరాతో పాటు బాలీవుడ్ మూవీ వార్ కూడా ఆక్యుపై చేసేశాయి.

పోటా పోటీయే…..

చాణక్య సినిమా మీద అంచనాలెలా ఉన్నప్పటికి ప్రస్తుతం సైరా మ్యానియా నడవడంతో చాణక్య పరిస్థితి ఏం అర్ధం కావడం లేదు. అలాగే చాణక్య ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే కపిస్తున్నాయి. మరో పక్క ఊరంతా అనుకుంటున్నారు సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ తప్ప మరో ప్రమోషన్స్ లేదు. బుధవారం బాలీవుడ్ మూవీ వార్ కి ఎక్కువ థియేటర్స్ కేటాయించారు. ఆ సినిమా కి హైదరాబాద్ లో యావరేజ్ టాక్ పడడంతో ఇప్పుడు ఈ శనివారం నాటికి వార్ జోరు తగ్గితే గనక ఆ థియేటర్స్ లో కొన్ని గోపీచంద్ చాణక్యకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఆదివారం వరకు, సైరా, వార్ లు కాస్త పోటీగా నడిచే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఈ రెండిటి మధ్యన చాణక్య నలిగిపోవడం ఖాయం గా కనబడుతుంది.

 

Tags:    

Similar News