భార్య సలహాలు తీసుకుంటానంటున్న చైతు!

Update: 2018-07-12 07:59 GMT

టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా చెప్పుకునే నాగ చైతన్య -సమంత ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. పెళ్లికి ముందు వీరు కలిసి సినిమాలు చేసినప్పటికీ పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాలేదు. ఎవరైనా పెళ్లి తర్వాత హీరో - హీరోయిన్లుగా సినిమా చేయడం మాత్రం చాలా అరుదు. అయితే అలానే ఈ జాబితాలో నాగచైతన్య- సమంత జోడీ చేరబోతోంది.

పెళ్లైన జంటగా...

'నిన్ను కోరి ఫేమ్' శివ నిర్వాణ దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో వీరి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అని చైతు క్లారిటీ ఇచ్చాడు. ఇందులో వీరు పెళ్ళైన భార్యాభర్తలుగా నటించబోతున్నారంట. అందుకు కారణం వివరిస్తూ... "ఇది పెళ్ళైన జంట కథ..ఇప్పటివరకు మేము ప్రేమ కథలు చేశాం.. కానీ ఈసారి కొత్తగా భార్యాభర్తలుగా నటించబోతున్నాం.

సామ్ మొహం మీదే చెప్పేస్తుంది...

ఈ పాయింట్ కొత్తగా అనిపించడంతో మేము ఒకే చేసాం. ఇప్పుడు కూడా నేను సమంతకు సైట్‌ కొట్టినట్టు నటిస్తే.. ఏం బాగుంటుంది?’’ అన్నాడు చైతు. "తాను చేసే సినిమాల విషయంలో నా వైఫ్ సలహాలు తీసుకుంటూ ఉంటానని చెప్పాడు చైతు. సామ్ ఏం అనుకుంటే అది మొహం మీద చెప్పేస్తుందని.. పోస్టర్ బాగోలేదని.. ట్రైలర్ బాగోలేదని ఇలా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది అని అందుకే ఆమె సలహాలు తీసుకుంటూ సాగుతా’’ అని చైతు అన్నాడు.

Similar News