అఖిల్ వద్ద నేర్చుకుంటున్న చైతు

వయసుపరంగా చూసుకుంటే అఖిల్ కంటే చైతు పెద్ద. పైగా సినిమాల్లోకి అఖిల్ కి కన్నా చైతూనే ముందు వచ్చాడు. ఏమైనా టిప్స్ తీసుకోవాలంటే చైతు దగ్గర నుండి [more]

Update: 2019-03-30 12:10 GMT

వయసుపరంగా చూసుకుంటే అఖిల్ కంటే చైతు పెద్ద. పైగా సినిమాల్లోకి అఖిల్ కి కన్నా చైతూనే ముందు వచ్చాడు. ఏమైనా టిప్స్ తీసుకోవాలంటే చైతు దగ్గర నుండి అఖిల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ రివర్స్ లో అఖిల్ దగ్గర చైతు టిప్స్ తీసుకున్నాడట. ఆ టిప్స్‌ తోనే మ‌జిలీలోని త‌న పాత్ర‌కి న్యాయం చేశానంటున్నాడు నాగ‌చైత‌న్య‌. అవును మజిలీ సినిమా కోసం చైతు అఖిల్ దగ్గర టిప్స్ తీసుకున్నాడు. ఎందుకంటే చైతు ఇందులో క్రికెటర్ గా కనిపించనున్నాడు. తమ్ముడు అఖిల్ కి క్రికెట్ పై పట్టు ఉంది కాబట్టి అతని దగ్గర చైతు ఎలా ఆడాలి.. ఏంటి అని స‌ల‌హాలూ సూచ‌న‌లు తీసుకున్నాడట.

క్రికెట్ లో టిప్స్

అలానే కొంత‌మంది రంజీ ప్లేయ‌ర్స్ ద‌గ్గ‌ర కోచింగ్ తీసుకున్నాడు చైతు. ‘‘ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను. ఆ త‌ర‌వాత బ్యాట్ ముట్టుకోలేదు. అఖిల్ మాత్రం ఎప్పుడూ క్రికెట్ ధ్యాస‌లోనే ఉంటాడు. అందుకే అతని దగ్గర టిప్స్ తీసుకున్నా’’ అని చైతు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. గోపీసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు శివ ద‌ర్‌ిక‌త్వం వహించారు

Tags:    

Similar News