9 నెలలైనా.... హడావిడి మాత్రం తగ్గలేదుగా!

Update: 2018-06-11 08:12 GMT

టాలీవుడ్ క్యుటేస్ట్ ప్రేమ జంట నాగ చైతన్య - సమంత ల వివాహమై అప్పుడే తొమ్మిది నెలలు కావొస్తుంది. హిందూ, క్రిష్టియన్ సంప్రదాయంలో జరిగిన ఈ పెళ్లి గత ఏడాది ఒక సెన్సేషన్. ఐదేళ్లు ప్రేమలో ఉన్న నాగ చైతన్య, సమంత లు గత ఏడాది అక్టోబర్ లో పెళ్లి చేసుకుని జీవిత భాగస్వాములయ్యారు. ఇక గోవాలో లో హిందూ, క్రిష్టియన్ సంప్రదాయంలో కొద్దిమంది అతిధుల మధ్యన అంగరంగ వైభవంగా నాగార్జున వీరిద్దరి పెళ్లి జరిపించాడు. ఇక నాగ చైతన్య - సమంత లు పెళ్ళై ఇన్నాళ్లయినా ఇంకా కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు వలే మురిసిపోతున్నారు. అయితే పెళ్ళై ఇన్నాళ్లకు మరోమారు ఈ జంట ఇంటర్నెట్ లో తెగ హైలెట్ అయ్యింది.

మధుర క్షణాలన్నీ ఈ వీడియోలోనే...

అది కూడా సమంత, నాగ చైతన్య ల పెళ్లి వీడియో ప్రోమో ని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతోనే... ఆ పెళ్లి వీడియో లో నాగ చైతన్య.. అఖిల్ ని టై అడగడం.. అలాగే చైతు, సామ్ ల ప్రేమతో పాటుగా కుటుంబాల మధ్య ప్రేమను ఎంతో అద్భుతంగా చూపించారు. చైతు సమంత మీద అక్షింతలు పొయ్యడం, సామ్ కూడా చైతు మీద అక్షింతలు పొయ్యడం,. చైతు వాళ్ళ అమ్మతో పెళ్లి మండపానికి రావడం, రానా దగ్గుబాటి బ్యాండ్ మోగిస్తూ హుషారుగా డాన్స్ చెయ్యడం, నాగార్జున కోడలు సమంతను ప్రేమగా హాగ్ చేసుకోవడం.. అన్నిటికన్నా ఎక్కువగా.. ప్రతి వస్తువు మీద చై - సామ్ ల పేర్లు ఇలా ఆ పెళ్లి వీడియో చూస్తుంటే అబ్బా ఇలాంటి పెళ్లిళ్లు స్వర్గం లోనే జరుగుతాయి అని అనిపిస్తుంది.

వైరల్ అవుతున్న వీడియో...

మరి పెళ్లి జరిగి ఇన్నాళ్లయినా.. ఇప్పటికి సమంత - నాగ చైతన్య ల పెళ్లి చూస్తుంటే నిన్నమొన్న జరిగినట్టుగా అనిపిస్తుంది. ఇక సమంత ఈ వీడియో తో పాటుగా ప్రామిస్ చేసినట్టే.. మా పెళ్లి వీడియో మీకు షేర్ చేస్తున్నా.. అని చెప్పిన సమంత ఈ పెళ్లి వేడుకలు లను ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు అంటూ వెడ్డింగ్ ఆల్బమ్ తీసిన జోసెఫ్ రధిక్ కు థాంక్స్ కూడా చెప్పేసింది. ఇప్పుడు సామ్ - చై ల పెళ్లి వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది.

Similar News