సెలెబ్రటీస్ మిస్సింగ్?

నిన్న జరిగిన హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలింగ్ శాతం 40 నుండి 45 శాతంగా నమోదైంది. బస్తి జనాల ఓట్లు తప్ప.. సాఫ్ట్ వెర్ ఇంకా చదువుకున్నవాళ్ళు [more]

Update: 2020-12-02 05:39 GMT

నిన్న జరిగిన హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోలింగ్ శాతం 40 నుండి 45 శాతంగా నమోదైంది. బస్తి జనాల ఓట్లు తప్ప.. సాఫ్ట్ వెర్ ఇంకా చదువుకున్నవాళ్ళు ఎవరూ గ్రేటర్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చెయ్యలేదు అనేది ఈ ఎన్నికల పోలింగ్ శాతం చూస్తే అనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో సెలబ్రిటీస్ హంగామా చాలా తక్కువగా కనబడింది. చిరు, నాగార్జున, విజయ్ దేవరకొండ, లక్ష్మి మంచు, రామ్ పోతినేని, బెల్లకొండ లాంటి స్టార్స్ తప్ప మిగతా స్టార్స్ ఎవరూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి రాలేదు. కరోనాకి భయపడొద్దు.. ఓటు హక్కు వినియోగించుకోండి అని విజయ్ దేవరకొండ లాంటి హీరో చెప్పినా హైదరాబాద్ జనాలు నిద్రావస్థలోనే ఉన్నారు కానీ.. ఓటు వెయ్యడానికి రాలేదు. ఇక యంగ్ హీరోస్ లో అందులోను స్టార్ హీరోస్ లో ఎవరూ ఓటు వెయ్యలేదు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ ఇలా ఎవరూ తమ ఓటు వినియోగించుకోలేదు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఫ్యామిలీతో కలిసి ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేసేవాడు. కానీ ఈ గ్రేటర్ ఎన్నికలని ఎన్టీఆర్ లైట్ తీసుకున్నాడనిపిస్తుంది.

మెగా ఫ్యామిలి చిరు – సురేఖ తప్ప మిగతా వాళ్లెవరు ఓటేయ్యలేదు. అయితే మెగా ఫ్యామిలీ మొత్తం నిహారిక పెళ్లి కోసం రాజస్థాన్ వెళ్లిపోవడం వలనే ఈ గ్రేటర్ ఎన్నికలో ఓటు వెయ్యలేకపోయింది అనే టాక్ ఉంది. ఇక అల్లు ఫామిలీ లో అల్లు స్నేహ ఓటేసినా అల్లు అర్జున్ కానీ అరవింద్ ఫ్యామిలీ కానీ ఓటేయ్యలేదు. మరోపక్క రాజమౌళి ఓటెయ్యండి అంటూ ప్రచారం చేసేవాడు. మరి రాజమౌళి కూడా హ్యాండ్ ఇచ్చేసాడు. ఓటు హక్కు వినియోంచుకుని సెల్ఫీలతో సందడి చేసే స్టార్స్ ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోయారు. ఇక ప్రభాస్ ముంబైలో ఉన్నాడనుకుంటే.. మహేష్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. కానీ ఓటు హక్కు వినియోగించుకోలేదు. చిరు భార్యతోను, నాగ్ భార్యతోను కలిసి వచ్చి ఓటెయ్యగా.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుంటే.. చాలామంది సెలబ్రిటీస్ ఇల్లు దాటి బయటికి రాలేదంటే… కరోనాకి భయపడ్డారా? ఆలా అయితే షూటింగ్స్ కి వెళ్లకూడదను కదా అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. 

Tags:    

Similar News