వాయిదాల మీద వాయిదా.. వడ్డీలు వాచిపోవడమే?

సినిమాలన్నీ కరోనా ఎఫెక్ట్ తో అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదాలు పడుతున్నాయి. దానితో భారీ నష్టాలూ కలగడం ఖాయం. కరోనా ఎఫెక్ట్ ఎప్పటివరకు ఉంటుందో అనేది [more]

Update: 2020-03-25 07:50 GMT

సినిమాలన్నీ కరోనా ఎఫెక్ట్ తో అనుకున్న సమయానికి విడుదల కాకుండా వాయిదాలు పడుతున్నాయి. దానితో భారీ నష్టాలూ కలగడం ఖాయం. కరోనా ఎఫెక్ట్ ఎప్పటివరకు ఉంటుందో అనేది ఎవ్వరికి తెలియదు. దానితో భారీ సినిమాలు, చిన్న సినిమాల షూటింగ్స్ మొత్తం ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దానితో నిర్మాతలంతా బెంబేలెత్తుతున్నారు. చాలామంది నిర్మాతలు తమ దగ్గర ఉన్న డబ్బుతోనే సినిమా తియ్యడానికి సాహసం చెయ్యరు.

తమ డబ్బు కొంత పెట్టి.. మిగతాది వడ్డీ కి ఫైనాన్సియర్స్ దగ్గర తెచ్చి సినిమాలకు పెట్టుబడి పెడతారు. తాజాగా RRR నిర్మాత డివివి దానయ్య అయితే RRR కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అంత డబ్బు ఆయన దగ్గర లేకపోయినా వడ్ఢిలకు ఫైనాన్షియర్స్ దగ్గర తేవడం.. సినిమాని రిచ్ గా నిర్మిస్తారు. ఇప్పుడు కరోనా దెబ్బకి షూటింగ్స్ వాయిదా పడిన సినిమాల నిర్మాతలు ఆ సినిమాలకు అప్పు తెచ్చిన చోట వడ్డీ కట్టలేక లబోదిబోమనాల్సిందే అంటూ నిర్మాతలు అప్పుడే గగ్గోలు పెడుతున్నారట. వడ్డీలు వాచిపోవడమే ఇప్పుడెలా.. లాభాలు రాజకపోయినా పర్లేదు.. ఆ వడ్డీ దబ్బలొచ్చినా చాలురా దేవుడా అంటున్నారట.

Tags:    

Similar News