కేన్స్ 2019 స్పెషల్ అపియరెన్స్..!

కేన్స్ 2019 ఉత్సవాలు గత మూడు రోజుల క్రితమే అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. హాలీవుడ్ నటీమణులే కాదు బాలీవుడ్ భామలు సైతం కేన్స్ 2019 రెడ్ కార్పెట్ [more]

Update: 2019-05-20 10:05 GMT

కేన్స్ 2019 ఉత్సవాలు గత మూడు రోజుల క్రితమే అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. హాలీవుడ్ నటీమణులే కాదు బాలీవుడ్ భామలు సైతం కేన్స్ 2019 రెడ్ కార్పెట్ మీద అందమైన డ్రెస్సులతో హంసల్లా హొయలు ఒలికిస్తున్నారు. దీపికా పదుకొనె రోజుకు నాలుగైదు డ్రెస్సులతో సందడి చేస్తుంటే.. ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో లిప్ లాక్స్ తో, అదిరిపోయే డ్రెస్సులతో కిక్కెక్కిస్తోంది. ఇక కంగనా రనౌత్ కూడా డిజైనర్ డ్రెస్సులతో వేడెక్కిస్తుంటే.. చాలామంది బాలీవుడ్ భామలు కేన్స్ 2019 ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ మీద అదరగొట్టేస్తున్నారు.

అదరగొట్టిన ఐశ్వర్య రాయ్

ఇక దీపికా, ప్రియాంక, కంగనా, హ్యూమా ఖురేషి ఇలా అందరూ కేన్స్ 2019 రెడ్ కార్పెట్ మీద సందడి చేస్తుంటే తాజాగా మరో బాలీవుడ్ భామ అక్కడ తన కూతురితో పాటుగా అందరినీ మైమరిపించింది. బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్య రాయ్ మొన్నటివరకు కేన్స్ 2019 ఫెస్టివల్ లో కనిపించలేదు కానీ నిన్న మాత్రం కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి అదిరిపోయే డ్రెస్ తో అదరగొట్టే అందాలు ఆరబోస్తూ కేన్స్ 2019 రెడ్ కార్పెట్ లో మెరుపులు మెరిపించింది. పెళ్ళై పాప ఉన్నా ఐష్ అందం మాత్రం ఇంకా అద్భుతమని చెప్పాలి. ఐష్ అలా కేన్స్ రెడ్ కార్పెట్ మీద ఇచ్చిన ఫోజులకి మతి పోవాల్సిందే.

Tags:    

Similar News