రాజ్ తరుణ్ కల నెరవేరేనా?

రాజ్ తరుణ్ డైరెక్టర్ కాబోయి హీరో అయ్యాడు. ఉయ్యాలా జంపాల తో హీరోగా మారిన రాజ్ తరుణ్ అసలు ఇండస్ట్రీలోకి వచ్చింది డైరెక్టర్ అవుదామని. కానీ ఉయ్యాలా [more]

Update: 2020-10-10 02:04 GMT

రాజ్ తరుణ్ డైరెక్టర్ కాబోయి హీరో అయ్యాడు. ఉయ్యాలా జంపాల తో హీరోగా మారిన రాజ్ తరుణ్ అసలు ఇండస్ట్రీలోకి వచ్చింది డైరెక్టర్ అవుదామని. కానీ ఉయ్యాలా జంపాల ఆడిషన్స్ అపుడు రాజ్ తరుణ్ అనుకోకుండా హీరో అయ్యాడు. వరసగా మూడు హిట్స్ పడేసరికి రాజ్ తరుణ్ హీరోగానే సెటిల్ అయ్యాయి. కానీ ఈమధ్యన వరసగా నాలుగు సినిమాల ప్లాప్ తో రాజ్ తరుణ్ కెరీర్ డోలాయమానంలో పడింది. హీరోగా రాజ్ తరుణ్ కెరీర్ గురించి అందరూ మట్లాడుకుంటున్నారు. టాలెంట్ ఉన్నా మూస కథలు, రొటీన్ కథల్తోనే రాజ్ తరుణ్ ప్లాప్స్ బారిన పడుతున్నాడు. కొత్తగా ఆలోచించలేకపోతున్నాడా? లేదంటే ప్రేక్షకులు దేన్నీ అయినా ఆదరిస్తారని ధీమానో కానీ రాజ్ తరుణ్ మాత్రం ప్రస్తుతం ఆలోచనలో పడ్డట్టుగా ఉన్నాడు.

ఆలోచన అంటే ఓ ఇంటర్వ్యూ లో రాజ్ తరుణ్ తాను డైరెక్టర్ కాబోయి హీరో అయ్యా అని కానీ ఎప్పటికైనా డైరెక్టర్ అవతారమెత్తుతా అంటున్నాడు. అయితే ఇప్పటికే తాను ఇద్దరు హీరోలని దృష్టిలో ఉంచుకుని కథలు రాసుకున్న అని అది ఒకటి అల్లు అర్జున్ ని మదిలో పెట్టుకుని ఆయనకున్ సరిపోయే కథ రాసుకున్న అంటున్నాడు. తర్వాత సునీల్ హీరోగా ఓ సినిమా కథ తయారు చేశా అంటున్నాడు. కథ రాసుకునేటప్పుడే హీరోలను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తామని చెబుతున్నాడు రాజ్ తరుణ్. అయితే బన్నీతో సినిమా చేస్తానో లేదో అనే నిరాశతో మాట్లాడుతున్నాడు. మరి సునీల్ కథతో నిర్మాత దొరికితే రాజ్ తరుణ్ డైరెక్టర్ అవతారమెత్తినా ఎత్తొచ్చు. కానీ బన్నీ రాజ్ తరుణ్ కి దొరకాలంటే కాస్త కష్టమే. మరి బన్నీ తో రాజ్ తరుణ్ సినిమా చెయ్యాలనే కల నెరవేరుతుందో లేదంటే రాజ్ తరుణ్ చెప్పినట్టుగా చేయలేడో చూడాలి.

Tags:    

Similar News