బాలయ్య స్థానంలోకి సి.కళ్యాణ్..!

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండే స్టార్ట్ [more]

Update: 2019-03-06 08:30 GMT

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండే స్టార్ట్ కావాలి కానీ రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బాలయ్య ఈ మూవీని జూన్ లో స్టార్ట్ చేద్దాం అని చెప్పారట. బోయపాటి.. బాలయ్యను చాలా పవర్ ఫుల్ గా చూపించాలని డిసైడ్ అయ్యాడట. అందుకే ఆ పాత్రను డిజైన్ చేసే పనిలో ఉన్నాడు బోయపాటి.

తప్పుకున్న బాలయ్య…

అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రొడ్యూసర్ మారుతున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను బాలయ్యనే నిర్మించాలని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. గతంలో బోయపాటి బాలయ్యతో సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసాడు. ఇది వీరి కాంబినేషన్ లో మూడో చిత్రం. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News