ప్రయోగం చేయనున్న బన్నీ..!

Update: 2018-08-23 06:23 GMT

ఎంతో ఇష్టపడి కష్టపడి బాగా అలోచించి చేసిన సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయితే ఎవరైనా బాధ పడటం సహజం. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అటువంటి అనుభవం ఎదురైంది. అయన లేటెస్ట్ గా నటించిన 'నా పేరు సూర్య' సినిమాపై బన్నీ చాలా హోప్స్ పెట్టుకోవటం... ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆలోచనలో పడ్డాడంట.

పునర్జన్మల కథనా..?

అందుకే తన నెక్స్ట్ మూవీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సారి తనతో పాటు తన ఫ్యాన్స్ కూడా నచ్చే అంశాలు ఆ కథలో ఉండేటట్టు చూసుకుంటున్నాడు. బన్నీ నెక్స్ట్ మూవీ 'మనం' ఫేమ్ విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఉండనుందనే సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కథ ఏమై ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తుతోంది. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఇది పునర్జన్మల నేపథ్యంలో రూపొందనుందని తెలుస్తుంది. స్క్రీన్ ప్లే తో సాగే ఈ కథ కోసం బన్నీ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చేనెలలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Similar News